
AVUNU VILLIDDARU KASTAPADDARU HASYA NATIKA
₹25
In stock · 9 available
PublisherVEERLA VARAPASAD
LanguageTelugu
ఔను... వీళ్ళిద్దరూ కష్టపడ్డారు “ఔను...వీళ్ళిద్దరూ కష్టపడ్డారు " ¥ అది మధ్యతరగతి ఇల్లు. * ఇంటి పనివాడు అప్పన్న హడావిడిగా కుర్చీలు, టీపాయ్, టేబుల్ వగైరా సర్దుతున్నాడు. * ఇంటి యజమాని తిమ్మన్న అటూ ఇటూ పచార్లు చేస్తూ సెల్లో మాట్లాడుతున్నాడు. తిమ్మన్న: (సెల్లో) హలో... హలో... నేనేనండి తిమ్మన్నని. ఎందాక వచ్చారు? అప్పుడే మాఊరి బస్టాండ్లో దిగేశారా? సరె... సరె... బైటికొచ్చి ఆటో ఎక్కండి. ఏబస్సూ గుద్దకపోతే పావుగంటలో ఇక్కడుంటారు. ఏంటీ... గుద్దితేనా? పదినిమిషాల్లో మేమే మిమ్మల్ని ఆసుపత్రిలో కలుస్తాం. (ఇంట్లోంచి తిమ్మన్న తండ్రి గోపి (గోపాలం) మోడరన్ డ్రెస్లో నల్ల కళ్లద్దాలు, టోపీ పెట్టుకుని వచ్చాడు.) తిమ్మన్న: (గోపితో) నాన్నా... అమ్మాయిని చూసుకోటానికి మగపెళ్లివాళ్లు వచ్చేస్తున్నారు. ఈ రోజన్నా కాస్త నా కూతురికి తాతగా కనిపించు.