AYYO PAPAM KUYYO MORRO by MADABHUSHI DIVAKARBABU Telugu book cover

AYYO PAPAM KUYYO MORRO

by MADABHUSHI DIVAKARBABU

₹100
In stock · 21 available
PublisherPRIYAMAINA RACHAITALU
LanguageTelugu
నా'నుడి' తెలుగు సాహిత్యం మూడు పూవులు, ఆరు కాయలుగా వర్థిల్లుతున్నా, తెలుగులో బాలసాహిత్యం మాత్రం సాహిత్యాభిమానులు కోరుకుంటున్న స్థాయిలో వెలువడ్డం లేదన్నది నిర్వివాదాంశం. కారాణాలేమైనా కావచ్చు కాని, భవిష్యత్తరాలకు అందాల్సిన సంస్కృతీ సంప్రదాయ రుచులు అందించడానికి చేయాల్సిన ప్రయత్నం మాత్రం జరగడం లేదు. ఏ నలభై ఏళ్ళు దాటిన వారికో సాహిత్యాభిరుచి వుంటే సరిపోదు. పిన్నవయస్సులోనే సాహిత్యం పట్ల అభిమానం, సంస్కృతి పట్ల ఆసక్తి వుండాలి. అలా వుండాలంటే బాలసాహిత్యం వెల్లి విరియాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు తగు రీతిలో శిక్షణ ఇవ్వాలి. కుటుంబ సభ్యులీవిషయంలో తోడ్పడాలి. లేకపోతే స్వార్ధపూరిత సమాజం, అత్యాశావహమైన తరం దురాశావహమైన తరం ప్రబలుతుంది. తల్లిదండ్రులు పిల్లలు ఏమి చదువుకోవాలనుకుంటున్నారో, ఏమి చదువుతున్నారో కనుక్కుంటూ వుండాలి. పిల్లల ఇష్టాయిష్టాలను దృష్టిలో పెట్టుకొని, వారికిష్టమైన రంగాల్లో నిపుణులయ్యేట్లు చూడాలి. అప్పుడే పువ్వుల్లాంటి పిల్లల్లో నిజమైన వికసనం... పరిమళం... ఈ అంశాన్నే వస్తువుగా తీసికొని సుప్రసిద్ధ నాటక, సినీ రచయిత శ్రీ మాడభూషి దివాకర బాబు పెద్దల కోసం వ్రాసిన పిల్లల నాటిక యిది. ఈ నాటికలోని పాత్రలన్నీ సింబాలిక్ గా జంతువుల, పక్షుల పాత్రలు. ఈ నాటిక ఈ నాటి విద్యావ్యవస్థపై ఎక్కుపెట్టిన బాణం. ప్రస్తుత సమాజంపై శ్రీ దివాకర బాబు వేసిన Satire ఇది. పులి, కోతి, జింక, దున్న, బాతు, నెమలి, కోకిలలాంటి పశు పక్ష్యాదులతో పాటు నక్కకూడా వుంటుందీ నాటికలో, అడవిలో నక్క స్కూల్ నడపడం, ఆ స్కూల్కి పులి ప్రభువుగా permission ఇవ్వడం కథాంశం. "నీ లైఫ్ నువ్వు ఎవ్వరినైనా నమ్ము. కానీ, ఎప్పటికీ నమ్మకూడనిది నక్క అది మనిషంత Danger” అని రచయిత శ్రీ దివాకర బాబు నాటికతో ఒకచోట పేర్కొంటాడు. వారి ప్రతిభా కిరణం తళుక్కుమని మెరుస్తుందిక్కడ!