B.V.V. PRASAD HAIKOOLU by B.V.V. PRASAD Telugu book cover

B.V.V. PRASAD HAIKOOLU

by B.V.V. PRASAD

₹90
In stock · 16 available
PublisherVASIREDDY PUBLICATIONS
LanguageTelugu
ISBN9788192412894
ఇవాళ వుదయం లక్ష హడావుడి పనులు ముగించుకుని, ఆఫీసుకు వెళ్ళటానికి తయారై - నాతోపాటు వస్తానన్న స్నేహితురాలి కోసం యెదురు చూస్తూ, పెరిగిన బి.పి.తో, పనులు సకాలంలో, సక్రమంగా పూర్తికావేమోనన్న ఆందోళనతో వేయి దిగుళ్ళతో, వంద భయాలతో సతమతమవుతూ అనుకోకుండా మీ రాలినపూలను చేతిలోకి తీసుకున్నాను. ఇపుడు ఈ క్షణాన యెంత నిర్లిప్త ప్రశాంత దుఃఖమో మనసునిండా. దు:ఖం బాధతో కాదు. ఆనందంతోనూ కాదు. యెందుకో నాకు నిజంగా తెలియదు. తెలియాల్సిన అవసరమూ లేదు. ఈ హృదయానుభూతి బాగుంది. ఈ పుస్తకం ప్రతులు ఒక వందకొని నాకోసం పది వుంచుకుని మిగిలినవి నా ప్రియ మిత్రులందరికీ కానుకగా యిస్తాను. ఒక చక్కని చల్లని స్నేహమయ మైన పరిసరాలను యెక్కడైనా యెప్పుడైనా మనుషుల చుట్టూ సృష్టించగల శక్తి రాలిన మీ కవితా కుసుమాలకు వుంది. మానవులను సేదదీర్చటానికి ప్రకృతి సమకూర్చిన అపురూప వరాలన్నిటినీ ఒక చిన్ని పుస్తకంలో పేర్చి ప్రకృతిని అనాలోచితంగా, నిర్దయగా, నిర్లజ్జగా ధ్వంసం చేసిన మానవజాతికి యెంతో ప్రేమతో యిచ్చారు మీరు. మీ మనసులో మానవులమీది ప్రేమను అలాగే నిలుపుకోండి. నిలుపుకుంటారు.