BADI GANTALU BALA GEYALU - 30 by BEHARA UMA MAHESWARA RAO Telugu book cover

BADI GANTALU BALA GEYALU - 30

by BEHARA UMA MAHESWARA RAO

₹30
In stock · 7 available
PublisherBEHARA UMA MAHESWARA RAO
LanguageTelugu
బడిగంటలు... ఒక పరిచయం తెలుగు సాహిత్య చరిత్రలో ఉత్తరాంధ్ర కొక విశిష్టమైన స్థానం ఉన్నది. తొలి ఆధునిక బాలగేయాలు ఇక్కడే రూపు దిద్దుకున్నాయి. పిల్లలు కధల పుస్తకాలు కొన్ని మొదట్లో ఇక్కడే అచ్చయ్యాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన "బాల" తెలుగు బాలల మాసపత్రికను ఇక్కడి వారేనడిపారు. బాలగేయ రచన, బాలకధల పుస్తకాల ప్రచురణ, బాలపత్రికనడపటం వంటి కార్యాలు బాలలకోసం నిర్వహింపబడటంతో బాలసాహిత్యచరిత్రలో ఉత్తరాంధ్ర విశిష్టతను సంపాదించుకున్నది. గిడుగు సీతాపతిగారు 1908 ప్రాంతంలో రాసిన "చిలుకమ్మ పెండ్లి, రైలుబండి పాటలు" తొలి ఆధునిక బాలగేయాలు. అప్పటివరకూ బాలల కోసమంటూ జానపదగేయాలు రూపంలో ఉన్న బాలలకు సంబంధించిన ఆట-పాటలకు తోడు రచయితలు బాలలకోసం పాటలు రాయపూనుకోవటం ఇదే ప్రధమం. ఆనాడు ఆంధ్రదేశంలోనే ఉన్న “పర్లాకిమిడి”కి చెందిన వారు సీతాపతిగారు. ఇంచుమించు అదేకాలంలో, విజయనగరంలో నివసించిన, నవ్యాంధ్రసాహిత్యానికి యుగకర్త అయి, “ముత్యాల సరాలు" అందించిన గురజాడ అప్పారావుగారు "మిణుగురులు” పేరుతో కొన్ని బాలగేయాలు రచించారు. " అరటికాయ బజ్జి - మినప్పప్పు సొజ్జి కలసి మెలసి తిందాం - కధల విధలు విందాం!" అన్న నాలుగు పదాల చిన్న గేయం " ఏనుగు ఎక్కి మనం ఏవూరెళదాం! రచించారు. ఏనుగు ఎక్కి మనం ఏలూరెళదాం" అంటూ సాగే పదహారు పాదాల గేయం పిల్లల కధల పుస్తకాలు ప్రచురించటంలో తొలిప్రయత్నం చేశారు, అయ్యగారి వీరభద్రరావుగారు. “చిలుక పంపిన కబురు” లాంటి చిన్నకధ రాసి ఒక పుస్తకంగా "కృష్ణవిలాస్ గ్రంధాలయం” పేరుతో 1926 లో పర్లాకిమిడి నుంచే అందించారు.