
BAHUJANA HINDU BRAHMANEEYA HINDUTHVA OKATENA
₹60
In stock · 145 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Bahujana Hindu - Brahmaneeya Hinduthva Okatena? - by Prof. K.S. Chalam సింధు, హరప్ప, రాఖీగర్తి, కీలాడి నాగరికతలు (క్రీ.పూ. 2500) అతి ప్రాచీనమైనవి. నాటి ప్రజల నమ్మకాలు, సంస్కృతి నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదివాసి, దళిత, శూద్ర (బి.సి.) కులాల దినచర్యల్లో, పోలేరమ్మ, పైడితల్లి వంటి అమ్మల మొక్కుల్లో, శ్రమణుల తాత్వికతలో ప్రతిబింబిస్తుంది. ఇది బహుజనుల మతం. హిమాలయాలకావల మేరు పర్వతం, అముదర్య నదీ ప్రాంతం పచ్చిక బయళ్ళలో గుఱ్ఱం, ఆవుల ఆధారంగా జీవించే ఆర్యులు కొందరు సింధు దాటి మన దేశంలోకి, మరికొందరు ఇరాన్, ఇరాక్, గ్రీస్ వంటి దేశాలకు క్రీ.పూ. 1600 సంవత్సరాల్లో చేరుకున్నారని చరిత్రకారులంటున్నారు. ఇటీవల జెనిటిక్స్ ఆధారంగా నిరూపించారు కూడా. ఈ జాతి నమ్మకాలల్లో త్రిమూర్తులు, అగ్ని, వరుణ, ఇంద్ర, బ్రహ్మ వంటి దేవతలు మాట్లాడే భాషా కుటుంబాలు సంస్కృతంతో సహా ఒకటే. వీటిని గ్రహించే బ్రిటిష్ వారు ఈ నమ్మకాలను హిందూ మతం అన్నారు. బహుజనుల, అన్యుల ప్రత్యేకతల మధ్య జరిగిన ఘర్షణలు, చారిత్రిక, తాత్విక వైరుధ్యాలు ఇందులో విశ్లేషణాత్మకంగా వివరించబడ్డాయి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్