
BAHUJANULU RAJYADHIKARAM
₹70
In stock · 25 available
PublisherN.S.SATYANARAYANA RAO
LanguageTelugu
ముందుమాట మిత్రులు శ్రీ నేరెళ్ళ కోటేశ్వరరావు వ్రాసిన “బహుజనులు రాజ్యాధికారం” పుస్తకాన్ని ఆమూలాగ్రం చదివాను, పుస్తకం పేరే మకుటాయమానంగా ఆలోచింపచేసేదిగా ఉండటమే గాక ముఖచిత్రం రాజ్యాధికారానికి ఓటు హక్కు వినియోగం గ్రంథానికి సమీక్షను సులభతరం చేసింది. పుస్తకాన్ని చదువుతుంటే రచయిత తన భావాలను సూటిగా పాఠకులకు చిన్నమాట అంటూ పెద్దల తలలోని ఆలోచనలను ప్రస్ఫుటంగా వ్రాసి అభినందిస్తున్నాను. బాబా సాహెబ్ అంబేద్కర్ మాటని హృద్యంగా “రాజ్యాధికారానికి రాలేని జాతి అంతరించిపోతుంది” రాజ్యాధికారమైన మాస్టర్కీ పొందినవారు ఏదైనా ఆచరణలో చూపగలరు” అన్న మాటను ఉటంకించడం రాజ్యాధికారమంటూ గంగ వెర్రులెత్తేవారికి హెచ్చరికే కాదు కార్యాచరణకు మార్గం. రాజులు రాజ్యాలు లేని ప్రజాస్వామ్య రాజ్యంలో ఓటు ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి మాన్యశ్రీ కాన్షీరాం గారి మాట “ఓట్లు మావి – సీట్లు మీవా? నహీ చలేగ- నహీచలేగా” అని ఉత్తరప్రదేశ్లో బహుజనులను జాగృతం చేసి ఓటు ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాధికారాన్ని బహుజన బెహెన్ మాయావతి చేజిక్కించుకొని ముఖ్యమంత్రయిందన్న హితోక్తి భారతదేశంలోని బహుజనులకు కనువిప్పవుతుందని, బాబా సాహెబ్ కోరిన బౌద్ధభారత నిర్మాణం ద్వారా బహుజనులు దేశరాజ్యాధికారాన్ని పొందటం దగ్గరలోనే ఉందని నా అభిప్రాయం.