BAHUMATHI KATHA - 2 (2013 ) by CHEEKOLU SUNDARAIAH Telugu book cover

BAHUMATHI KATHA - 2 (2013 )

by CHEEKOLU SUNDARAIAH

₹120
In stock · 27 available
PublisherTELUGU SAHITHEE SAMITHI
LanguageTelugu
రామదుర్గం మధుసూదన రావు ఎగిరిపోతే ... ఎంత బాగుంటుందీ ... ! నౌ టైం కమ్స్ స్టూడియోలో గడ్డకట్టినట్టు నిశ్శబ్దం. లైట్ల ఫోకస్లో కెమెరాలు కదులుతున్నాయి. స్టేజి మీద చిన్నారులు నలుగురు కళ్లు గట్టిగా మూసుకుని ఉన్నారు. యాంకర్ మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి ... ఫ్రెండ్స్ ... నాల్గు నెలలుగా అవిచ్ఛిన్నంగా సాగుతున్న జూనియర్ సూపర్ సింగర్... స్వరయాత్ర చివరి దశకు చేరుకోబోతోంది. ఈ సెమీ ఫైనల్స్ ఫైనల్ రౌండ్లో అంటే ఎలిమినేషన్ రౌండ్లో ఒకరు నిష్క్రమిస్తారు. జడ్జెస్ మార్కులు ... ఎస్సెమ్మెస్ ద్వారా ఓటింగ్ ... ఈ పిడుగుల అద్భుత పర్ఫార్మెన్స్ ... విలుస్తారో ... ఎవరు వెళ్లిపోతారో ... మరికొద్ది క్షణాల్లో తేలిపోతుంది ... అంతా కలిపాక ఎవరు స్టేజిపై అవినాశ్ కళ్లు మూసుకునే వింటున్నాడు. అంతా కలగా ఉన్నట్టుంది. రిజల్ట్స్ త్వరగా చెబితే బావుణ్ను అనుకున్నాడు. అవినాశ్ ... యాంకర్ స్వరం దగ్గరగా వినిపించడంతో కళ్లు తెరిచాడు ‘చెప్పు అవినాశ్... నీకు ఏం అనిపిస్తోంది ... యాంకర్ ప్రశ్నకు చిరాకేసింది ఇక్కణ్నుంచి వెళ్లిపోతే బావుంటుందని చెప్పాలనుకున్నాడు ... కానీ మమ్మీ, డాడీలు గుర్తొచ్చి ... 'ఫైనల్లో ఉంటాను అనిపిస్తుంది ...' సాధ్యమైనంతవరకు నవ్వు పులుముకుంటూ బదులిచ్చాడు. అడిగింది '... కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నావు ... ఎనీ డౌట్స్ ...' యాంకర్ మళ్లీ రెట్టించి