
BAHUMATHI KATHA 2008-2009
₹60
In stock · 6 available
PublisherTELUGU SAHITHEE SAMITHI
LanguageTelugu
రంజని పుట్టు పూర్వోత్తరాలు ప్లవ (1961) ఉగాది శుభ సందర్భంలో “చుట్టూరా ఆవరించిన చీకటిని నిందించడం కంటే దీపం చిన్నదైనా సరే - వెలిగించమనే" ఆర్యోక్తి ప్రధానాశయంగా ఒక సాహితీ సమితిని ఏర్పాటు చేయాలని ఏ.జి. ఆఫీసు ఉద్యోగులైన కొందరికి కలగడం, అయిదు మాసాలకి అంటే 22-9-1961వ తేదీన రచయితల సభ ఏర్పాటు కావడం "రంజని” ఆవిర్భావానికి బీజాలు నాటి నట్లయింది. ఇసుకపల్లి దక్షిణామూర్తి సమావేశ కర్తగా పదకొండు మంది సభ్యుల సంఘం ఏర్పడింది. రంజని పత్రికా ప్రచురణ, సాహితీ కార్యక్రమాల నిర్వహణ అమలుపరచే యోచన కార్యరూపం దాల్చింది. 1962 సంక్రాంతితో ప్రారంభమైన పత్రికా ప్రచురణ ఇప్పటివరకూ కొనసాగుతోంది. రంజని మొదటి అధ్యక్షులు ఇసుకపల్లి దక్షిణామూర్తి, కార్యదర్శి చాడ గోపాలకృష్ణ నుంచి ప్రస్తుత అధ్యక్షులు చీకోలు సుందరయ్య, ప్రధానకార్యదర్శి మట్టెగుంట వెంకటరమణ వరకు ఇరవై ఏడు కార్యవర్గాలు రంజని నిర్వహణా బాధ్యతలు చేపట్టాయి. నలభై ఎనిమిది సంవత్సరాల రంజని చరిత్రలో సాహితీవేత్తలు, కవులు, విమర్శకులు, కథారచయితలు, ఉపన్యాసకులు, కులపతులు, నాటక ప్రయోక్తలు, సంగీత విశారదులు, కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీతలు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు, సినిమా రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులు, నవలా రచయితలు, రచయిత్రులు, దర్శకులు, నాట్య కళాస్రష్టలు, ఆంధేతర భాషా పండితులు ఎందరో రంజని వేదిక నలంకరించారు. ఇతర భాషా ప్రముఖులలో డా. సచ్చిదానంద రౌత్రాయ్ (ఒరిస్సా), జయకాంతన్ (తమిళం), హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ (బెంగాలీ, ఆంగ్లం), హరిభజన్ సింగ్ (పంజాబీ), దేవవ్రతదాస్ (అస్సామీ) తదితరులు రంజని వేదికనలంకరించారు. వి.వి.గిరి రాష్ట్రపతిగా ఉన్న కాలంలో 'ఫస్ట్డీ' శ్రీమతి వి.వి.గిరి రంజని సందర్శించారు. సాహితీ సభలు, చర్చలు, గోష్ఠులు, కావ్యగానాలు, ఉపన్యాసాలు వివిధ సాహితీ ప్రక్రియల్లో పోటీలు, క్విజ్లు, సాహితీ శిబిరాలు ఇలా రంజని అన్ని ప్రక్రియల్లోను పోటీలు, జంటనగర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నిర్వహించింది.