BAHUMATI KATHALU - SALEEM by SALEEM Telugu book cover

BAHUMATI KATHALU - SALEEM

by SALEEM

₹350
In stock · 7 available
PublisherNAVODAYA BOOK HOUSE
LanguageTelugu
అమ్మకానికి ఆక్సిజన్ ఆదివారం సాయంత్రం... మా ఇంటి వెనుక ఉన్న విశాలమైన తోటలో పడక్కుర్చీ వేసుకుని కూచున్నా. ఎటుచూసినా పచ్చదనమే. కళ్ళకు హాయిగా ఉంది. చల్లటి గాలి ... శరీరం మేఘాల్లో తేలిపోతున్న అనుభూతి ... పక్షుల కిలకిలా రావాలు... వీనులవిందుగా, సంగీతం వింటున్నంత కమ్మగా ఉంది. నాకు చెట్లంటే ప్రాణం. నా పిల్లల్ని ఎంత శ్రద్ధగా, ప్రేమగా పెంచానో ఈ తోటలోని ప్రతి మొక్కనీ అట్లాగే పెంచాను. పెళ్ళయిన కొత్తలో కొన్న జాగా ఇది. వెయ్యి గజాల స్థలం. వనస్థలిపురంలో స్థలాలు కొనడానికి వెనకాడేవారు ఆ రోజుల్లో. సిటీకి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరం. నాకైతే సిటీకి దూరంగా ఉండడమే ఇష్టం. ఎలాగూ పల్లెల్లో ఉండే అదృష్టం లేదాయె. ఉదర పోషణార్ధం ఉద్యోగాల వేటలో కాంక్రీట్ కీకారణ్యం లాంటి ఈ సిటీలోకొచ్చి పడ్డాను. ఇక్కడి రద్దీ ... వాతావరణ కాలుష్యం మనిషికి మనిషి తగులుతున్నంత ఇరుకైన కదలిక ... నాకు చిరాకు మనుషులూ అంతే ... మనసులనిండా రద్దీనే తరచూ మెదళ్ళలో ట్రాఫిక్ జాంలు... నాకు సిటీ జీవితం సుతరామూ నచ్చదు. యింట్లో అందరూ వద్దంటున్నా వినకుండా, ధర తక్కువగా ఉందని వెయ్యి గజాల స్థలం కొన్నాను. ఆఫీస్ లోన్ పెట్టి వంద గజాల స్థలంలో రెండు గదులూ, కిచెన్ ఉండేట్టు ఇల్లు కట్టుకున్నాను. నేను కట్టాక చాలామంది ఇళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడిది చాలా పెద్ద కాలనీగా ఎదిగింది. మిగిలిపోయిన తొమ్మిది వందల గజాల ఖాళీస్థలంలో రకరకాల మొక్కలు నాటాను. ఇప్పుడవి నా కొడుకుల్తోపాటు పెరిగి పెద్దవై మహావృక్షాలుగా మారాయి. అదుగో అటువైపు