
BALA BANDHU B.V NARASIMHARAO
₹200
In stock · 3 available
PublisherSAHITHI MITHRULU
LanguageTelugu
బాల సాహిత్య పరిశోధకులకు తరగని గని పిల్లల్ని ప్రేమించే కుటుంబానికి చిన్నబాలశిక్ష పిల్లలలో చైతన్యం నింపే ఉపాధ్యాయులకు దారి చూపే దీపం నాలుగు దశాబ్దాలు పిల్లల ముందు గేయాలు పాడ్తూ కథలు చెప్తూ వారిని పరవశింప చేసిన బాలబంధు బి.వి. నరసింహారావు ఇంట్లో తల్లిదండ్రులు స్కూలులో ఉపాధ్యాయులు పిల్లలకు ఆటా పాటా ఎలా నేర్పాలో రచించి, అలవోకగా వాటిని చెప్పి చూపిన అసాధారణ బాలసాహిత్య సృష్టికర్త. వాశిలోనూ రాశిలోనూ ఆయన రచనలు విశిష్టమైనవి. మనం పిల్లలకు తెలుగు భాషని ఎంత సులువుగా అందించవచ్చునో విప్పి చెప్పిన బోధకుడు. చిన్న చిన్న విషయాలు మనసుకు పట్టే కథనాలు, కల్పనలు ఆరోగ్యకరమైన ఆలోచనలు - వీటిని పిల్లల చుట్టూ ఎలా పెంచవచ్చునో చాటిన సంచార తోటమాలి బి.వి. సంప్రదాయం, సమకాలీనత, కాల్పనికత, సంగీత గుణం కలబోసి అందించిన బి.వి. సమగ్ర సాహిత్య సర్వస్వం ఇది. నిరాడంబరంగా జీవించి, మంచి స్నేహితులతో గడిపి పిల్లల కోసం రచనలు చేసిన ఒక అసాధారణ ఉపాధ్యాయుని సమగ్ర సాహిత్యం - మూడు సంపుటాలలో...