
BALA BRAHMAM
₹10
In stock · 16 available
PublisherPROF.RAVIKANTI VASUNANDAN
LanguageTelugu
శైశవ జీవన వేదం ఈ కవి పేరే వసునందన్. అంటే బాలకృష్ణుడు. ఇతడు సాహిత్యలీలా బాలుడుగా ఎదిగిన ధురంధరుడు. నాలుగు కథాకావ్యాలు, ఏడు దీర్ఘకావ్యాలు, మూడు గేయకావ్యాలు, తొమ్మిది వచనకవితా సంపుటులు, నాలుగు సాహితీ విమర్శ-పరిశోధన గ్రంథాలూ, ఇంకా ఏడు వివిధ కృతులు, ఇలా ఇన్నాళ్లూ అవలీలగా రాసివేసి ప్రతిష్ఠాత్మకమైన షోడశ పురస్కారాలు అందుకున్న సాహిత్య జగజ్జెట్టి. సంప్రదాయాన్ని, ఆధునికతను సమంగా సంతరించి సాహిత్యరథం నడుపుతున్న సారథి. ఈ వసునందనుడు ఇప్పుడు తాత అయ్యాడు. 'మనుమ' సిద్ధితో శ్రీహర్ష పులకాంకితుడైన కవి గుండెపొంగితే వెలువడిందీ కావ్యం. బాలబ్రహ్మం అనడంలోనే-సృష్టిలోని శైశవ వైశిష్ట్యాన్ని సృజనాత్మకంగా ఆవిష్కృతం చేయడం స్పష్టమవుతోంది. స్వచ్ఛశైశవ హృదయం వున్న కవిగానీ బాలబ్రహ్మాన్ని దర్శించడం సాధ్యం కాదు. ఈ కావ్యం శైశవాన్ని భిత్తికగా చేసుకుని, వ్యక్తి తాత్త్విక రసానుభూతిని బ్రహ్మానందమయం చేస్తుంది. పిడికిళ్ల కొద్దీ రహస్యాలు, దోసిళ్లకొద్దీ తారంగాలు, ఆనందామృతగంగలు తన రచనా విన్యాసంతో అందిస్తాడు కవి. రూప రస గంధ స్పర్శలనూ, పంచ భూతాత్మక ప్రపంచాన్నీ, సకలసృష్టి అందాలనూ అన్నిటినీ పసివాడి ప్రతి కదలికలో దర్శించి, అక్షర రమ్యతతో అనుభూతిమయం చేయడం పరిణత లేఖినికే సుసాధ్యం. కొనసాగుతున్న వసునందన్ కవితాయాత్రలో బాలబ్రహ్మం ఒక తీర్థయాత్ర. ప్రకృతి మనిషికిచ్చిన కోటికోటి పుణ్యఫలం పసితనం అని అందుకే సంభావించ గలిగాడు. చొంగకార్చే నోటిలో పచ్చి పసితనం గుబాళింపులు ఎన్ని పుట్ల సుగంధ ద్రవ్యాలు సాటి? అనగలిగాడు. పవ్వళిస్తే వటపత్రశాయి పరవశిస్తే మహానందదాయి కాళ్లు చేతులు కదిలిస్తే మత్స్యమూర్తి పారాడితే శ్రీకూర్మం ఆడుకుంటే ఆదివరాహం