BALA KATHAAMRUTHAM (PILLALA KOSAM SWATANTRYA AMRUTHOSTAVA KATHALA KANUKA) by KOLLURU SWARAJYAM VENKATARAMANAMMA Telugu book cover

BALA KATHAAMRUTHAM (PILLALA KOSAM SWATANTRYA AMRUTHOSTAVA KATHALA KANUKA)

by KOLLURU SWARAJYAM VENKATARAMANAMMA

₹200
Currently out of stock
PublisherKOLLURU SWARAJYAM VENKATARAMANAMMA
LanguageTelugu
"బాలబాట” బాలల మాసపత్రికకు కమిషనర్ వారి ముందుమాట మన భారతదేశం స్వాతంత్య్రం సాధించి ఆగష్టు, 15వ తేదీ నాటికి 75వ సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా -బ్రోత్సవ వేడుకలను దేశమంతా జరుపుకుంటున్నందుకు దేశ పౌరిడిగా చాలా గర్వపడుతూ నా సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇవి "వబ్రోత్సవాలు మాత్రమే కాదు అమృతోత్సవాలు" అని కూడా నేను భావిస్తున్నాను. భారతదేశంలో ఎవరు జన్మించినా వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. భారతదేశం శాంతికి చిహ్నం. ఆనాడు బ్రిటిష్ పరిపాలన నుండి "మన దేశ స్వతంత్రం మన జన్మహక్కు" అనే నినాదంతో శాంతియుత పోరాటంచేసి స్వాతంత్ర్యాన్ని సాధించుకోగలిగాము. ఈ శాంతియుత పోరాటానికి మహాత్మాగాంధీ, మరెందరో దేశ నాయకులు ఎంతో కృషిచేసి స్వాతంత్ర్యం సాధించి మనకు అందించి నందుకు వారికి శతకోటి వందనాలు అర్పిస్తున్నాను. ఈ భారతదేశంలో ఎంతోమంది మేధావులు, విద్యావంతులు, చరిత్రకారులు ఉన్నారు. ఎంతటి వారైనా వారి తెలివితేటలను పెంపొందించుకొని చరిత్రకారులుగా చరిత్రలో స్థానం సంపాదించు కుంటారు. నేటి బాలలే రేపటి పౌరులు అని మనకు తెలుసు. అటువంటి బాలబాలికల్లో ఎంతో విజ్ఞానాన్ని, పెద్దల పట్ల గౌరవం, మంచి బుద్ధిని, నడవడికను, దేశభక్తిని, వ్యక్తిత్వ వికాసానికి సూచనలను చూపుతూ బాలల అభ్యున్నతికి, వారి పురోగతికి "బాలబాట" లను వేస్తున్న బాలల మాస పత్రిక నిర్విరామంగా కొనసాగిస్తున్న బాలబాట సంపాదకురాలు కె. ఎస్.వి. రమణమ్మ గారు అభినందనీయురాలు. 2021 ఆగష్టు, 15వ తేదీన 75వ స్వాతంత్య్ర దినోత్సవం" సందర్భంగా బాలబాట బాలల మాసపత్రికలోని అన్ని శీర్షికలనూ దేశభక్తి, దేశరక్షణ. దేశప్రగతి మొదలైన అంశాలతో వెలువరించారు. అంతేకాకుండా 75 మంది బాల సాహితీ వేత్తలచే 75 పిల్లల కథల సంకలనాన్ని "బాలకథామృతం" గా ప్రచురించినందుకు సంపాదకురాలు రమణమ్మగారిని అభినందిస్తూ..... మరిన్ని కథలను, బాలబాలికలకు అందించి వారిని చరిత్రకారులుగా తీర్చిదిద్దుటకు కావలసిన విజ్ఞానాన్ని, సూచనలను ప్రచురించాలని కోరుకుంటున్నాను. ఇట్లు కమిషనర్ Ay ए. 2. 5, IAS మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ బాల కథామృతం పిల్లల కథల సంకలనం