_front-display.webp)
BALA (MITRA) KATHALU (BALA KATHA SAMPUTI)
₹50
In stock · 1 available
PublisherPOTTI SRIRAMULU TELUGU VISWAVIDYALAYAM
LanguageTelugu
[మనసులో మాట] కథ, కవిత, పద్యం, నవల, నాటకం ఇవన్నీ సాహిత్యంలో విభిన్న ప్రక్రియలు. వీటిలో నేనింతవరకు కవితల జోలికి పోలేదు. పద్యం సంగతి సరేసరి. నాటికలు, వ్యాసాలు ఎన్నిరాసినా కథ, నవలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చాను. నా తొలి కథ "పద్మప్రియ” అలనాటి ఆదివారం వార పత్రికలో అచ్చయింది. అలాగే నా మొదటి వ్యాసం "స్త్రీలలో వ్యక్తిత్వం” ఆంధ్రప్రభవార పత్రికలో ఇదీ సంగతి శీర్షికన బహుమతి పొందిన రచనగా ప్రచురింపబడింది. ఇక నా మొట్ట మొదటి నవల “త్రివేణి సంగమం" ఆ నాటి మేటి పత్రిక ఆంధ్రసచిత్ర వార పత్రికలో సీరియల్గా వచ్చి అసంఖ్యాక పాఠకుల ఆదరాభిమానాల్ని చూరగొంది. ఫలితంగా లభించిన ప్రోత్సాహంతో 1975 నుండి నేటి వరకు నా కలానికి విరామం ఇవ్వకుండా సుమారు నాలుగు వందల కథలు, తొమ్మిది నవలలు రాసాను. అవన్నీ వివిధ దినవార మాసపత్రికల్లో ముద్రణ పొందాయి. వాటిలో కొన్నిటికి బహుమతులు కూడ లభించాయి. వీటితో పాటు ప్రత్యేకంగా పిల్లలకోసం సుమారు రెండు వందల కథలు రాసాను. అవి బాలమిత్ర, బాలజ్యోతి, బొమ్మరిల్లు, బుజ్జాయి వంటి మాసపత్రికల్లో పడ్డాయి. పాఠకుల ప్రోత్సాహంతో ఇంతవరకు నాలుగు కథాసంపుటాల్ని వెలువరించ గలిగాను. అయితే ఈ మారు బాలకథల సంపుటి తెస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనవచ్చింది. “మీ ఉద్దేశం భేషుగ్గా ఉంది" అంటూ సన్నిహితులు, శ్రేయోభిలాషులు నా వెన్ను తట్టారు. అందరికోరిక మేరకు "బాల (మిత్ర) కథలు” శీర్షికన బాలకథల సంపుటిని మీ ముందుకు తెస్తున్నాను. దీంట్లో కథలు పెద్దవాళ్లకి కూడ ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల ఆలోచనాశక్తిని ఇనుమడింప జేస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అందరూ ఈ పుస్తకాన్ని కొని చదివి పిల్లల చేత చదివించి నన్ను మరింతగా ప్రోత్సాహించ గోరుతున్నాను. నా ఈ గ్రంథ ప్రచురణకు ఆర్థిక సహాయం అందజేసిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పుస్తకాన్ని ఇంత రమ్యంగా తీర్చిదిద్దిన ప్రింట్ పాయింట్ అధినేతలు శ్రీ బాలు, గణేష్ గార్లకు కూడా నా ధన్యవాదాలు. ఇదివరలో నా కథా సంపుటాల్ని చదివి ఆదరించిన రసజ్ఞపాఠక మహాశయులకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ...