BALA SAHITYAM BALAANANDAM BRAMHANANDAM by EETURI ANANTHAPADMANABHAM (TIRUMALA) Telugu book cover

BALA SAHITYAM BALAANANDAM BRAMHANANDAM

by EETURI ANANTHAPADMANABHAM (TIRUMALA)

₹60
In stock · 55 available
PublisherEETURI ANANTHAPADMANABHAM (TIRUMALA)
LanguageTelugu
అందాలు - మకరందాలు "బాలవాక్కు - బ్రహ్మవాక్కు" అన్నది ఎంత సత్యమో "బాలానందం బ్రహ్మానందం" అన్నది కూడా అంత సత్యమే. అందుకే శ్రీ యీటూరి అనంతపద్మనాభం (తిరుమల) గారు ఈ బాలల గేయ సంకలనానికి "బాలానందం బ్రహ్మానందం" అని పేరు పెట్టారు. ఇది తెలిసి చేసిన పని. అంటే బాలల హృదయాన్ని శ్రీ యీటూరి వారు అంతగా స్వాయత్తం చేసుకున్నారు. Unless you become a Child, you cont'get the mind of a Child ໑໖ ໑. ఒకటి పిల్లల కోసం వ్రాసేది. రెండవది పిల్లల ఆలోచనలను, ఆటపాటలు పసిగట్టి, పరిశీలించి వాళ్ళ భాషలో, వాళ్ళ స్థాయికి తగినట్లు పెద్దలు వ్రాసేది. ఈ రెండవది కష్టతరమైనది. శ్రీ యీటూరి వారు దీనిలో కృతకృత్యులైనారు. వారు పిల్లల ఆలోచనలలో వదిగిపోయి ఈ గేయాలను రచించారు. అంటే అంతగా ఎదిగిపోయారు. బ్రహ్మానందాన్ని అనుభవించి మనలను అనుభవించమంటున్నారు. అందంగా, మకరందంగా బాల గేయాలు రచించిన శ్రీ యీటూరి వారు అభినందనీయులు. బాలలు పాలనవ్వుల పాపలు, వాళ్ళ మనసులు ముత్యపుచిప్పలు, వాళ్ళ తలపులు మంచి ముత్యాలు, పిల్లల మమతలు వెన్నెల తరగలు. వాళ్ళ పలుకులు మీగడ తరకలు. తేనెకు తియ్యదనం వచ్చిందంటే అది పిల్లల నవ్వుల నుండే. జాబిల్లి వెలుగులకు చల్లదనం వచ్చిందంటే అది బాలల చూపుల నుండే. పిల్లల డెందాలు మందారాలకు మకరందాన్ని అందిస్తాయి. ఇంద్రదనస్సుకు ఏడు రంగులు. పిల్లల కన్నుల వెలుగులే మూలం. వాళ్ళు అరమరికలు తెలియనివాళ్ళు. అభం శుభం తెలియనివాళ్ళు. సంతోషపు దివ్వెలు. సంబరాల పువ్వులు. చందమామ వాళ్ళ అల వస్తువు. చల్లగాలి వాళ్ళ సైదోడు. శ్రీ యీటూరి అనంతపద్మనాభం గారు ఈ రహస్యాలన్ని పసిగట్టారు కాబట్టే ఈ బాలగేయాలను ఇంత అందంగా సమకూర్చారు. ఈ సంకలనంలో పిల్లల తలపులు, పిల్లల ఆటలు, పిల్లల పాటలు, పిల్లల మమతలు, పిల్లల అల్లరి ఒకటేమిటి అన్నీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆడినా అందమే, పాడినా అందమే, ఏడ్చినా అందమే, అలిగినా అందమే, నవ్వినా అందమే, ఏంచేసినా అందమే. ఆ అందాల ప్రపంచం ఈ సంకలనం.