
BALAJYOTHI KATHALU
₹150
In stock · 1 available
PublisherDELUX PUBLICATIONS
LanguageTelugu
1. యోగి సలహా ఒకప్పుడు దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఆటవిక జీవితం గడుపుతూ నాగరికత అన్నది లేకుండా జీవించారు. అయితే ఒక్కొక్క ప్రాంతానికీ ఒక్కొక్క రాజు ఏర్పడి జీవితం క్రమబద్ధమవుతూ వచ్చింది. ఆ కాలంలో దండాపథమనే ప్రాంతంలో జీవితం అరాజకంగానే ఉంటూ వచ్చింది. బలవంతులు బలహీనులను యధేచ్ఛగా పీడిస్తూ వచ్చారు. ఆ కారణంగా సామాన్య ప్రజలు ఏ పనీ సక్రమంగా కొనసాగించలేకపోయారు. ఎందుకంటే శ్రమ ఫలితం వారికి దక్కిన దాకా నమ్మకం లేదు. దండాపథంలో సుమిత్రుడనే ఒక బుద్ధిశాలి ఉండేవాడు. తన దేశపు ప్రజల జీవితం దుస్థితిలో ఉండటం అతన్ని ఎంతో బాధించింది. దేశంలోని దుర్మార్గులతో అతను ఎంతగానో చెప్పి చూశాడు, కాని వారు వారి పద్ధతులను మార్చుకోలేదు. చివరకు సుమిత్రుడు ప్రాణం విసిగి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యంలో సుమిత్రుడికొక యోగి కనిపించాడు. ఆయన అరణ్యంలోనే ఆశ్రమం నిర్మించుకుని యోగం అభ్యసిస్తున్నాడు. సుమిత్రుడాయోగిని పరిచయం చేసుకుని, దేశంలో అరాజకం పోయి బాగుపడాలంటే ఏంచేయాలి అని అడిగాడు. “ధైర్య బలపరాక్రమాలూ, వ్యక్తిత్వమూ గలవాణ్ణి ఎన్నుకుని రాజుగా ఏర్పాటుచేసుకుని జ్ఞానమూ, వివేకమూ, ధర్మబుద్ధి గల మంత్రిని నియమించినట్టయితే మీ దేశం బాగుపడుతుంది,” అని యోగి చెప్పాడు.