
BALALA BOMMALA BHARATHAM- 50
by SRI SANNIDHANAM NARASIMHA SARMA
₹50
In stock · 1 available
PublisherROHINI PUBLICATIONS
LanguageTelugu
బాలల బొమ్మల భారతము వేదవ్యాసుడు - విఘ్నేశ్వరుల కలయిక ఒకనాడు అన్ని విద్యలూ శాస్త్రాలూ తెలిసినవారు, వేదవేదాంగాలలో పండితుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మహాభారత రచనాద్యుడు అయిన వ్యాసమహర్షి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పూజించి “మహాత్మా! మహాభారత కావ్యం రూపొందించదలచాను. నిరాటంకంగా దానిని వ్రాసే సమర్థతగల ఒక లేఖకుని ప్రసాదించండి" అని వేడుకొన్నాడు. అంతట బ్రహ్మ “నీవు సంకల్పించిన మహాభారతాన్ని వ్రాయగల శక్తిసామర్థ్యాలు ఒక్క విఘ్నేశ్వరునికి మాత్రమే" కలవని చెప్పి "ఇష్టకామ్యార్ధసిద్ధిరస్తు" అని దీవించి తన నిజవాసానికి అంటే బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మ ఆశీర్వాదం పొందిన వ్యాసమహర్షి విఘ్నేశ్వరుని ప్రార్ధించాడు. విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై విషయం తెలుసుకొని “మహార్షీ! మీరు చెప్పినది వ్రాస్తాను గానీ మధ్యలో నా వ్రాతకు క్షణమైనా విశ్రాంతి కాని అడ్డుగాని రాకూడదు. అంత వేగంగా వివరించగలిగితే వ్రాస్తాను" అని సెలవిచ్చాడు. వ్యాసమహర్షి “అలాగే!” అని అర్థం జేసుకొని కలం, ఆగకుండా వ్రాయమన్నాడు. “తథాస్తు” అన్నాడు విఘ్నేశ్వరుడు.