
BALALA BOMMALA BHARATHAM - 60.00
₹60
In stock · 404 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఆదిపర్వం వేదవ్యాస జననం ఒకనాడు యమునా తీరమున పోతూ పరాశరుడు యమునపై నావనడుపుతూ ఒడ్డుకు తెడ్డువేసుకుంటూ వస్తున్న బెస్తకన్య - సత్యవతి సౌందర్యాన్ని గాంచి ముగ్ధుడై మోహపారవశ్యంలో తన వాంఛను ఆమెకు తెలియజేయగా ఆమె సిగ్గుపడింది. అంత పరాశరుడు తన తపోశక్తిచే కనుచూపు మేరంతా చీకటిని సృష్టించి, ఆమెను అనుభవించాడు. ఆ సత్యవతీ - పరాశర సంయోగంలో జనించాడు మహాభారతకర్త వేదవ్యాస మహర్షి జనించగానే "అమ్మా, నీవు తలచుకున్నంతనే నీ తనయుడు నీముందుందగలదమ్మా" అంటూ సెలవుతీసుకొని తపోవనానికి వెళ్ళిపోయాడు. గంగా శంతనులు అదేకాలంలో హస్తినాపురాన్ని పరిపాలించే శంతనుడు ఒకనాడు వినోదార్థమై గంగాతీరమునకేగి, అచటొక సౌందర్యరాశిని చూసి మోహించగా ఆమె శంతనుని భార్యకావడానికి అంగీకరించింది. కానీ ఒక ఆంక్షపెట్టింది. "నేను ఏంచేసినా పల్లెత్తు మాటనడానికి వీలులేదు. అలా అన్ననాడే నిన్ను విడిచి "వెళ్ళిపోతాను" అని. దానికి శంతనుడు అంగీకరించాడు. ఆ సౌందర్య రాశియే - గంగ! వారలా అన్యోన్యంగా గడుపుతుండగా వారిరువురికి ఒక బిడ్డడు పుట్టాడు. ఆ బిడ్డడ్ని గంగ గంగానదిలో పారవేసింది. అలా ఏడుగురు బిడ్డలు పుట్టగా ఏడుగురినీ గంగానదిలో పారవేయగా శంతనునికి ఆగ్రహం కలిగి ఎనిమిదవ బిడ్డను పారవేయకుండా ఆటంకపరిచాడు. అంతే, వెంటనే గంగ శంతనుని విడిచి వెళ్లిపోయింది. ఒకప్పుడు వీరు అష్టవసువులు. వశిష్టాశ్రమంలోనున్న కామధేనువు మహిమను తెలుసుకొని దాన్ని అపహరించగా వశిష్ఠుదాగ్రహుడై వారిని భూలోకంలో నరులుగా పుట్టమని శపించాడు. వారు శాపవిముక్తిని కోరారు. ఏడుగురు మాత్రం భూలోకమందు పుట్టగానే విముక్తులౌతారు. ఎనిమిదవవాడు