
BALALA KOSAM BHARATHADESA KATHA - 100
₹100
In stock · 465 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సర్వాల్టర్ ర్యాలేని లండన్ టవర్లో నిర్బంధించినపుడు అతడు ప్రపంచ చరిత్ర వ్రాయడం ప్రారంభించాడంటారు. ఒకనాడు అతనిగది కిటికీ క్రింద ఒక దెబ్బలాట శబ్దాలను విన్నాడు. బయటికి చూడగా ఒకడు మరొకణ్ణి చంపడం కనిపించింది. ఆ కలహానికి కారణమేమిటో ఆచూకీ తీయ ప్రయత్నించాడు. ఆ జగడానికి మూలమేదో చెప్పమని జైలు అధికార్లని మళ్ళీ మళ్ళీ అడిగినప్పటికి ప్రయోజనం లేకపోయింది. వారు అసలు కారణాన్ని చెప్పనేలేదు. తన కిటికీ వద్ద జరిగిన సంఘటనల్లోని నిజానిజాల్ని స్పష్టంగా తెలుసుకోలేని తాను అనేక సంఘటనలతో కూడిన చరిత్రని ఎలా వ్రాయడమా అనే సందిగ్ధంలో పడి అసలు గ్రంథ రచన ప్రయత్నాన్నే విరమించుకున్నాడు. భారతదేశ సంగ్రహ చరిత్రను వ్రాస్తున్న తరుణంలో ఆ కథే నా మనసులో మెదిలింది. వేలవేల సంవత్సరాల సుదీర్ఘకథలోని ప్రతి సంఘటనా కచ్చితంగా ఎవరికైనా ఎట్లా తెలుస్తుంది? కనుక, ఈ పుస్తకంలో మనదేశ చరిత్రని రేఖా మాత్రంగానే చెప్పడానికి ప్రయత్నించాను. దీనిని అంతవరకే తీసుకోవలసిందిగా కోరుతున్నాను. చిన్నపిల్లలకు దేశచరిత్రని గురించి ప్రాథమిక సమాచారం అందించడానికే ఈ పుస్తకం ఉద్దేశింపబడినది. ఇది మనదేశ చరిత్రని మరింత సమగ్రంగా తెలుసుకొనడానికి కుతూహలం కలిగించగలదని అనుకుంటున్నాను. ఈ చరిత్రని వ్రాసేటప్పుడు నేను నేర్చుకున్న పాఠం ఏదైనా వున్నదంటే అది ఇది. మనదేశ చరిత్రలో అత్యున్నతమైన దశలో ఉదాహరణకి అశోకుడు,