
BALALA MANASTHATHVALU
₹30
In stock · 4 available
PublisherJATHIYA SAHITYA PARISHAT
LanguageTelugu
బాలల మనస్తత్వాలు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు పెద్దలకు ప్రభుత్వమిచ్చే ప్రాథమిక హక్కు, బాలలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు జన్మతో సంక్రమిస్తాయి. వారిలోకం వారిదే. వారి ఆట పాటలకు వారే సృష్టికర్తలు. వారికి పాటలు పాడడానికి వేదికలు అక్కరలేదు. రహదారిలోనే పాటలుపాడుతూ, ఆటలు ఆడుతూ అభినయిస్తూ వెళుతుంటారు. ఎవరో ఒకరు చూస్తారనే భయంగాని, బెరుకు గాని వారి దరిదాపులకు వెళ్లదు. జలుబు చేస్తే పెద్దలైతే చేతిరుమాలు రోజుకొకటో, రోజుతప్పిరోజో మారు వాల్సిందే. కాని, పిల్లల విషయంలో మినహాయింపేస్తే.. వారికి జలుబు చేస్తే చొక్కానో, నిక్కరో వారికి చేతిరుమాల్లు. ఇవి చాలవన్నట్లు ఈ చేతికింత ఆ చేతికింత రుద్దుకుంటారు. ఇట్లా రుద్దుకోవడమేకాక, కుడి చేతి మట్టతో ఎడమ దిక్కుగా రుద్దితే ఎడమ దిక్కు మీసమౌతుంది. అట్లే ఎడమ చేతి మట్టతో కుడికి రుద్దితే కుడికి మీసమౌతుంది. ముక్కైతే బోరుబావి నుండి కారినట్లు కారుతూనే ఉంటుంది. కారింది కొంత దుస్తులకు, చేతులకు, మీసాలకు పోను మిగిలింది నోట్లోకి పోవాల్సిందే. కాకి ఎంగిలి అని ఎక్కడ పుట్టిందో, ఎట్లు వ్యాపించిందో తెలువదుకాని, ఏ చాక్లెటైనా, తినుబండారమైనా పిల్లలు ప్రేమతో చొక్కాలో మడచి కొరికి పంచుకుంటారు. అమ్మ ఒడైనా, బడైనా, చివరకు దేవుని గుడైనా వారికి ఒకటే... ఒకరిపై ఒకరు పడుతూ తోచుకుంటారు.