BALI KATHALU by BALI Telugu book cover

BALI KATHALU

by BALI

₹320
In stock · 18 available
PublisherMALLETEEGA
LanguageTelugu
బాలి కథలు బాలీ గారి కథా ప్రపంచం పల్లెపట్టుల్లో సహజంగా పెరిగే పెరటి తోట లాంటిది. తెలియని విదేశీ వృక్షాలూ, అవసరంలేని క్రోటన్ మొక్కలూ, విపరీతమైన చేష్టలతో అంటుకట్టిన చెట్లూ యిందులో వుండవు. సహజంగా, స్వభావ సిద్ధంగా పెరిగిన తోటలాంటి సాహిత్య వనం బాలీ గారిది. ఆయన ప్రపంచంలో నీతి, అవినీతీ, ధర్మమూ, అధర్మమూ మొదలైన పెద్ద పెద్ద చర్చలుండవు. ఆయన పాత్రలన్నిటికీ మామూలు మనుష్యుల్లో వుండే మామూలు తప్పులూ, మామూలు గొప్పతనాలే వుంటాయి. వాళ్ళు సిద్ధాంతాలు చెప్పరు. యెవరికి వాళ్ళవి మాత్రమే అయిన వైచిత్రులతో సహజంగా జీవిస్తారు. బాలీగారి ప్రపంచంలో జీవన సంరంభం వుంటుంది. జీవితాన్నొక పండుగలా గడిపినా, దాని బరువు కింద పర్చినలిగినా, ఆ పాత్రలందరిలో జీవితం పట్ల మమకారపు తౌల్యం మాత్రం తప్పకుండా వుంటుంది. బాలీగారు నాజూకైన మనిషి. ఆయన శైలీ నాజూకైంది. ఆయన వాక్యాలు నాజూకుగా నడుస్తాయి. యెంతటి కఠినమైన వాస్తవికతనైనా ఆయన అంతే నాజూకుగా చెప్తారు. ఆయన కథల్లో అక్కడక్కడా మెరిసే మెరుపులుండవు. కథంతా వెన్నెల పరచుకున్నట్టుగా నిర్మలంగా వుంటుంది. ఇందులో 'అప్పికట్ల వారి వీధి' పేరుతో ఓ యాభై ఏడు పేజీల కథ ఒకటుంది. ఆ కథ చదువుతున్నంత సేపూ నాకు ముళ్లపూడి వెంకటరమణ గారి ‘జనతా ఎక్స్ప్రెస్' కథే గుర్తుకొచ్చింది. ముళ్లపూడి గారికి బాపూగారనే గొప్ప స్నేహితుడుండేవారు. ఆయన తన స్నేహితుని కథలకు యిబ్బడి ముబ్బడిగా బొమ్మలేసి పెట్టేవాడు. 'జనతా ఎక్స్ప్రెస్' అనే ఆ పెద్ద కథ నిండా అందులోని పాత్రల బొమ్మలుండేవి కానీ అప్పికట్ల వారి వీధి కథకు ముళ్ళపూడి, బాపూ యిద్దరూ బాలీ గారే! తెలుగు కథా సాహిత్యంలో యిదొక అసాధారణ ఫీటు.