BALI PEETAM - RANGANAYAKAMMA by RANGANAYAKAMMA Telugu book cover

BALI PEETAM - RANGANAYAKAMMA

by RANGANAYAKAMMA

₹80
Currently out of stock
PublisherSWEET HOME PUBLICATIONS
LanguageTelugu
ముందు మాట [12 వ ముద్రణకు రాసినది] ఈ 'బలి పీఠం' నవలని 1962లో రాశాను. 23 2 సంవత్సరంలో. (నా పుట్టిన సంవత్సరం 1939. ఇది రాసింది 1962.) ఇది రాయడానికి 4 నెలలు పట్టింది. తర్వాత ఇది, 1962 సెప్టెంబరు నించీ 8 నెలల పాటు 'ఆంధ్రప్రభ' వార పత్రికలో సీరియల్గా వచ్చింది. ఆ తర్వాత నించీ ఇది పుస్తకంగా ఇప్పటికి 11 ముద్రణలు వచ్చింది. ఇప్పుడు ఇది 12 వ ముద్రణ. ఇది, పుస్తకంగా వచ్చినప్పుడు, మొదటి ముద్రణకు ఏదైనా 'ముందు మాట' రాశానో లేదో గుర్తు లేదు. ఆ కాపీ దొరకలేదు. 2 వ ముద్రణకు చిన్న ముందు మాట రాసినట్టుగా, 3 వ ముద్రణలో వున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కానీ, ఆ 'ముందు మాట'లో తారీకు లేదు. ఆ ముద్రణ కాపీ కూడా దొరకడం లేదు. కాబట్టి 2వ ముద్రణ కాలం కూడా తెలియడం లేదు. 3 వ ముద్రణ నించీ ఇప్పటి వరకూ, ఆ ముద్రణల ప్రచురణ కాలాలన్నీ ప్రతీ ముద్రణలోనూ వున్నాయి. ఈ నవల మీద, కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన 'ముందు మాట' ఒకటి, 3 వ ముద్రణ నించీ వుంది. ఆయన్ని నేను ఆ సమయంలోనే అడిగినట్టున్నాను. వెంటనే ఆయన 'పీఠిక' అనే పేరుతో, రాసి యిచ్చారు. అది, 3 వ ముద్రణలో ప్రారంభమై, అప్పటి నించీ ఈ నాటికీ, ఈ 12 వ ముద్రణలో కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. తర్వాత, 6 వ ముద్రణలో, నేను రాసిన 'కొత్త ముందు మాట' ఒకటి కొత్తగా చేరింది. ఈ నవలని ఆ సమయంలో మళ్ళీ చదివి, కొన్ని విమర్శలతో అది రాసినట్టున్నాను. ఆ 'కొత్త ముందు మాట' రాయడం తప్ప, అప్పుడు అసలు కధ జోలికి పోయినట్టు లేను. ఆ తర్వాత, ఈ నవలని ఏ రీ ప్రింటు సమయంలోనూ మళ్ళీ చదివినట్టు లేను. ఈ 12 వ ముద్రణ సమయంలోనే మళ్ళీ చదివాను. 6 వ ముద్రణలో రాసిన 'కొత్త ముందు మాట'లోకి ఇప్పుడు ఇంకా కొన్ని అంశాలు చేర్చాలని పించింది. అంతేగాక, అసలు కధలో, అక్కడక్కడా చిన్న చిన్న మార్పులూ చేర్పులూ చెయ్యాలని కూడా అనిపించింది. ముఖ్యంగా, 'కులాల' విషయంలో, పాత్రల ఆలోచనలు మరి కొంత వివరంగా వుండే విధంగా. కధలో ఆ ఆలోచనలు గతంలో లేనివి కావు. గతంలో వున్నవాటినే, ఇంకా కొంత స్పష్టత కోసం, కొంచెం పెంచాలని.