
BAMMA CHEPPINA BUJJAI KATHALU
₹36
In stock · 2 available
PublisherADELLA SIVAKUMAR
LanguageTelugu
అన్ని దానాలలో అన్నదానం గొప్పది... పూర్వకాలం కాశీరాజ్యంలో ఒక షావుకారు ఉండేవాడు. ఆ షావుకారుకి స్థానికంగానే కాకుండా దూర ప్రదేశాల్లో కూడా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. దేవుడి దయ వలన ఆయన వ్యాపారాలన్నీ చక్కగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఆయన లాభాన్నే చూస్తున్నాడు తప్ప ఎప్పుడూ నష్టం చూడలేదు. ఆ షావుకారుకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు విజయుడు. రెండో కొడుకు పేరు విక్రముడు విక్రముడికి వివాహం అయ్యింది. విజయుడికి ఇంకా వివాహం కాలేదు. పెద్ద కొడుకైన విజయుడు తండ్రి కూడా ఉండి వ్యాపారంలో ఉన్న మెళకువలు నేర్చుకున్నాడు. ఇప్పుడు తండ్రిని మించిన వ్యాపారి అని పేరు తెచ్చుకున్నాడు. అయితే అన్నదమ్ముల స్వభావంలో ఎంతో తేడా ఉండేది. షావుకారి పెద్ద కొడుకైన విజయుడు సర్వగుణ సంపన్నుడు. బుద్ధిశాలి, ఆలోచనా పరుడు. ఏవిషయమైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. పెద్దవారిని గౌరవించడంలో విజయుడికి సాటి వచ్చేవారు ఎవ్వరూ లేరని చెప్పవచ్చు. అతను ఎంతో ఉదారస్వభావుడు. దేహి అని ఎవరైనా తనముందు చేయి జాపితే వారికి లేదనకుండా దానమిచ్చి పంపేవాడు. ఎంతో ఐశ్వర్యం ఉన్నా కూడా నిరాడంబరంగా ఉండేవాడు. విజయుడు ప్రతిరోజు భోజనం చేసే ముందు తన ప్రక్కన ఎవరో ఒక అతిధి లేనిదే భోజనం చేసేవాడు కాదు. అతడు భోజనం చేసేముందు ప్రతిరోజు ఒక అన్నం ముద్దను నూతిలో వేసేవాడు. ఆ నూతిలో ఉన్న నీటిలో ఉన్న చేపలు విజయుడు వేసిన అన్నం ముద్దను ఎంతో ప్రీతిగా తినేవి. షావుకారి రెండో కొడుకైన విక్రముడు అన్నయ్యకు పూర్తిగా వ్యతిరేక స్వభావం కలవాడు. అతనికి ఆలోచన తక్కువ. ఆవేశం ఎక్కువ. అతనికి ఇంకా వివాహం కాలేదు.