
BANDOOK - NOVEL
₹125
In stock · 412 available
PublisherKANDIMALLA PRATAPA REDDY
LanguageTelugu
పేలిన 'బందూకు': తెలంగాణ సాయుధ పోరాటం, దాని నేపథ్యం తెలిసిన వారు ఈ తరంలో చాలా తక్కువ. చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఆ పోరాటం చరిత్ర పుస్తకాల్లోనూ పెద్దగా కనిపించదు. చరిత్ర రాసినా చదివించే గుణం లేకపోతే చేసిన ప్రయత్నమంతా వృథానే. ఇలాంటి ప్రముఖ అధ్యాయాలకు సజీవ రూపం ఇవ్వాలంటే సాహిత్య చట్రంలోనే సాధ్యం అవుతుంది. అటువంటి ప్రయత్నాలు చేసిన వారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఆ కొద్దిమందిలో కందిమళ్ల ప్రతాపరెడ్డి ఒకరు. ఆనాటి సాయుధపోరాటాన్ని ప్రత్యక్షంగా గమనించిన అనుభవంతో ఆయన రాసిన 'బందూక్' నవల కదలనీయకుండా చదివిస్తుంది. అప్పటి తెలంగాణ పల్లెల్లో జరిగిన దారుణాలను కళ్లముందు ఆవిష్కరించి కన్నీళ్లు తెప్పిస్తుంది. -ఈనాడు ఏకబిగిన చదివించే నవల: తెలంగాణా శైలిలో సాగిన ఈ నవల సులభమైన పదాలతో ఏకబిగిన చదవగలిగే విధంగా వుంది. చరిత్ర పాఠాల్లో తెలంగాణా ప్రజలు పడిన బాధలు చదివినా... ఈ నవలలో అవే బాధలు సజీవచిత్రాలుగా మన కళ్లముందు నిలుస్తాయి. నవలలోని పాత్రలు, సంభాషణలు చాలా సహజంగా అనిపిస్తాయి. జాతి ప్రయోజనాన్ని దృష్టిలో వుంచుకుని ప్రతి ఒక్కరూ త్యాగనిరతిని కలిగి వుండాలి. ప్రజలు తలిస్తే సాధించలేనిది ఏదీ లేదనీ, అందుకే అందరూ కలిసికట్టుగా వుండాలనీ ఈ నవల ద్వారా చాటి చెప్పారు రచయిత. ఈ నవలలోని కొన్ని సంఘటనలు చదువుతున్నప్పుడు మన మనసు విషాదంతో నిండిపోతుంది. -ప్రజాశక్తి తెలంగాణ ప్రజా పోరాటాన్ని చిత్రించిన నవల: ఈ నవల చదువుతుంటే పిడికిళ్లు బిగుస్తాయి. పాఠకుల రక్తం ఉద్రేకంతో ఉప్పొంగిపోతుంది. ఈ రచయిత తెలంగాణాకు చెందిన కమ్యూనిస్టు యోధులలో పేరు పొందినవారు. తెలంగాణా విముక్తి ఉద్యమానికి సంబంధించిన ఒళ్లు జలదరించే సంఘటనల్ని గుర్తుకు తెస్తారీ నవలలో. ఈ నవల అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా, ఉద్వేగపూరితంగా ముందుకు సాగుతుంది. నైజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటాన్ని ప్రతిఫలించిందీ నవల. ---వార్త పత్రికా సమీక్ష: కందిమళ్ల ప్రతాపరెడ్డి తన అనుభవాలను, చదివించే శైలిని సమపాళ్లలో మేళవించి "బందూక్"ను అందించారు. తెలంగాణ మాండలికం కూడా అన్ని ప్రాంతాల వారికీ హాయిగా బోధపడేలా వుంది. బందూక్ చాలా మంచి ప్రయత్నం. జరిగిన చరిత్రతో పాటు, నాటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను సందర్భోచితంగా తెలియచెప్పారు. ఎటువైపూ వకల్తా పుచ్చుకోకుండా యథాతథంగా యిందులో రికార్డు చేశారు. ఎక్కడా అనవసరమైన భావోద్వేగాలు ప్రదర్శించకుండా, ఎంతో సంయమనంతో పాత్రోచితంగా నవలను నడపడంలో రచయిత కృతకృత్యులైనారు. - పత్రిక 'బందూక్' భావితరాలకు క్లాసిక్: ఫ్యూడలిజాన్ని చక్కగా వర్ణించిన ఈ నవలను ప్రతి కమ్యూనిస్టు, ప్రతి ప్రజాస్వామ్యవాది. ప్రతి మానవతావాది తప్పక చదవాలి. ఫ్యూడలిజాన్ని గురించిన సంపూర్ణ అవగాహనకైనా ప్రతి జిజ్ఞాసువు చదవాలి. తెలుగు ప్రజలకు ఒక చక్కని నవల అందించినందుకు ప్రతాపరెడ్డి గారిని అభినందించకుండా వుండలేను. యన్నెస్, విశాలాంధ్ర