BANGARU KONDALAKU KATHALU by OM PUBLICATIONS Telugu book cover

BANGARU KONDALAKU KATHALU

by OM PUBLICATIONS

₹30
In stock · 4 available
PublisherOM PUBLICATIONS
LanguageTelugu
బంగారు కొండలకు కధలు... తెలివైన తెల్ల కుందేలు... అనగనగా ఒక అడవి. ఆ అడవిలో రెండు కుందేళ్లు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తెల్ల కుందేలు. రెండోది ఎర్ర కుందేలు. తెల్ల కుందేలు పేరు జాబిలమ్మ. ఎర్ర కుందేలు పేరు వెన్నెలమ్మ. ఎప్పుడు చూసినా జంట కవుల్లా అవి రెండూ కలిసి మెలసి తిరుగుతూ ఉండేవి. అలా తెల్ల కుందేలు, ఎర్ర కుందేలు కలిసి తిరుగుతూ ఉంటే చూడటానికి ఎంతో అందంగా కూడా ఉండేది. ఒకరోజు ఎర్ర కుందేలు, తెల్ల కుందేలు క్యారెట్ తోటలో క్యారెట్లు తింటూ ఆడుకుంటున్నాయి. తెల్ల కుందేలు పేరు జాబిలమ్మ... వెన్నెలమ్మ... అవి ఆటల్లో మునిగి తమ చుట్టూ ప్రపంచాన్నే మర్చిపోయాయి. ఆ సమయంలో అటువైపుగా నక్క అంటే ఎంత జిత్తులమారిదో తెలుసుగా!! దానికి ఆ రెండు కుందేళ్లను చూడగానే నోరూరింది. "హమ్మయ్య ఈరోజు నాకు ఆహారం వెతుక్కునే బాధ తప్పింది. నెమ్మదిగా వాటి దగ్గరకు వెళ్లి వాటిని మంచి మాటల్లో పెట్టి రెండింటిని చటుక్కున పట్టుకుని తినేయాలి" అని అనుకుంది. గబాల్న వాటి మీదకు దూకితే అవి పారిపోతాయేమో అని అనుకుని నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ వాటి దగ్గరకు వెళ్లింది. వాటి ఆటల్లో పడి రెండు కుందేళ్ళూ కూడా మొదట కుందేలు రాకను గమనించలేదు. అది ఇంక పది అడుగుల దూరంలో ఉందనగా అప్పుడు చూసింది. ఎర్ర కుందేలు నక్క తమను తినడానికి వస్తోందని.. కాగా నగడల " ఏయ్! జాబిలమ్మా! ఒక్కసారి అటు చూడు" అంది తెల్ల కుందేలుని ఉద్దేశ్శించి.....