
BANJARA TELUGU JAATIYAALU
₹75
In stock · 7 available
PublisherNUNAVATH RAMBABU
LanguageTelugu
ఆనంద చాలనం సాహిత్యం అంతగాలేని, అసలు లిపేలేని లంబాడీ / సుగాలీ/ బంజారా భాషలో జాతీయాల కోసం అన్వేషించటం, అదీ ఎం.ఫిల్ డిగ్రీ నిమిత్తం పరిశోధనకు పూనుకోవటం సాహసకృత్యం. ఆ సాహసం విజయవంతంగా చేశాడు నూనావత్ రాంబాబు. ఈ పరిశోధకుణ్ణి ప్రామాణికుడుగా పరివర్తింప చేయటానికి కృషి చేసిన పర్యవేక్షకుడు డా|| బి. భుజంగ రెడ్డి ప్రశంసాపాత్రుడు. లంబాడీ/సుగాలీ/బంజారా, ఏ పేరుతో ఈ జన సమూహాలను పిలిచినా, వీళ్ళ భాష పరిమితం. పద సంపద పరిమితం. ప్రసిద్ధ భాషలకుండే అభివ్యక్తి సామర్థ్యం దీనికి అంతంత మాత్రమే! ఈ భాషలో సాహిత్యం సర్వజన సామాన్యంకాదు. జానపద కథలు, గాథలు, పాటలు, ఆటల పాటలు ఉన్నాయి. అదీ పరిమితం. జాతీయాలు, నుడికారాలు, పలుకుబళ్ళు భాష అంతస్సారం ఆవిష్కరించే అంశాలు. భాష సారస్వత స్థాయి పొందితే అందులో లభించే జాతీయాలు గుర్తించటం కష్టం కాదు. పరిణత భాషా సాహిత్యాలలో ప్రస్ఫుటించే జాతీయాలు, అపరిణతంగా ఉన్న భాషలో వెదికే ప్రయత్నమే ఉత్సాహవంతుల గుండె ఉర్రూతల్ని చూపుతుంది. వాళ్ళ ఉత్సాహమే నా ఉద్వేగానికి కారణం. బంజారా భాషలోని సాహిత్యాంశాలుగా జానపద సాహిత్యాంశాలు పరిశీలిస్తే కొంత సమాచారం లభించవచ్చు. ఈ భాషను గూర్చి కృషి చేసి విశ్లేషింపవచ్చు. భాషాభివ్యక్తిలో అంతర్లీనంగా, అభివ్యక్తి సుందరంగా హృదయ చాలనంగా ఉండే సామెతల్ని పరిశీలించవచ్చు. ఆ సామెతల సృష్టికే మూలమైన గుండె వంటి జాతీయాల్ని బంజారా భాషలో గుర్తించడం కష్టం. ఆ కష్టం దాటితే, వాటిని సేకరించటం మరీ కష్టం. కష్టం సాధ్యమైతే, వాటిని వింగడించటం మరింత కష్టం. ఈ కష్టకార్యం సునాయాసంగా సాధించిన పరిశోధకుణ్ణి, పర్యవేక్షకుణ్ణి పరిశోధన ప్రపంచం ప్రశంసిస్తుంది.