
BAPU NADICHINA BATA
₹99
In stock · 11 available
PublisherREEM PUBLICATIONS
LanguageTelugu
ISBN9788183512442
బాపు నడిచిన బాట గాంధీజీ కథలు 1. మహాత్ముని ఆదర్శం గాంధీజీకి సత్యం, అహింస, మానవసేవ, నిరాడంబరత, స్వదేశీ వస్తువుల వినియోగం, వంటి ఉదాత్త ఆదర్శాలు వున్నట్టే 'సమయపాలన' అనే ఆదర్శం కూడా వుంది. ఏదయినా ఒక పని చెయ్యవలసి వస్తే అది సమయానికి చెయ్యడం, ఎవరయినా ఏదయినా సభకు ఆహ్వానిస్తే ఎన్ని ఆటంకాలు ఎదురయినా లెక్క చెయ్యక సమయానికి అక్కడికి వెళ్లడం, వంటి అలవాట్లు వున్నాయి. ఈ 'సమయపాలన' విషయంలో ఆయన చాలా పట్టుదలగా వుండేవారు. గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నిర్వహిస్తూ వుండే రోజులలో - ఆయన గుజరాత్ విద్యాపీఠ్ సెనేట్ సమావేశానికి వెళ్లవలసి ఉంది. ఆయన గుజరాత్ విద్యాపీఠ్ కు అప్పట్లో సెనేట్ సభ్యుడుగా ఉండేవారు. సాధారణంగా గుజరాత్ విద్యాపీఠ్ వారు సమావేశానికి రావడానికి ఆయనకు కారు పంపుతూ వుంటారు. కాని, అప్పుడు ఆయనకు కారణాంతరాల వల్ల కారు పంపలేకపోయారు. ఆ సంగతి ఆయనకు సమావేశానికి కొద్ది వ్యవధి మాత్రమే ఉండగా తెలిసింది. ఆశ్రమానికి ప్రత్యేకంగా కారు లేక పోవడం వల్ల గాంధీజీ గుజరాత్ విద్యాపీఠ్ు కాలినడకనే బయలుదేరారు. సాధారణంగా గాంధీజీ చాలా త్వరగా నడుస్తారు. కాని, ఎంత త్వరగా నడిచినా సమయానికి అక్కడకు చేరుకోలేమని ఆయనకు అనిపించింది. సరిగ్గా అలాంటి సమయంలో ఖద్దరు బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్లడం ఆయనకు కనబడింది. అతడు గాంధీగారు కనబడగానే సైకిల్ దిగి ఆయనకు నమస్కరించాడు.