
BARATHADESA PRADANAMANTRIKI LEGAL NOTICE
by Y.R.CHANDRA
₹300
In stock · 66 available
PublisherY.R.CHANDRA
LanguageTelugu
ఈ నవల గురించి ముందుమాట “మన పవిత్ర భారత దేశం 5 కోట్ల స్వదేశీ దేశ ద్రోహుల చేతుల్లో చిక్కుకుపోయి వున్నప్పుడు. 20 కోట్ల శ్రామిక జన కుటుంబాలు పడుతూలేస్తు వస్తున్నప్పుడు. అందుకు అందివచ్చే అవినీతులు అక్రమాలు నేరాలు ఘోరాలకు అవకాశం.. లేని.. రాని.. భారత దేశాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి...? పాలక ఉద్యోగ దళారి వ్యాపార వర్గాల్లో వున్న దేశ ద్రోహులను దేశ భక్తులుగా ఎలా తీర్చిదిద్దుకోవాలి...? కష్టపడే చేతులే సుఖపడాలి... అన్న శ్రీరామ వాచికాలు ఎలా నిలబెట్టుకోవాలి...? 190 లక్షల కోట్లే లెక్కతేలుతున్న మన భారత దేశ వార్షిక జాతీయ ఆదాయాన్ని 360 లక్షల కోట్లకు పైగా ఎలా లెక్కపెట్టాలి...?. 4.60 లక్షల కోట్ల వ్యక్తిగత వార్షిక ఆదాయం పన్ను వసూళ్ళు, 30 లక్షల కోట్లకు పైగా ఎలా వసూలు చేయాలి...? 20 కోట్ల రైతు శ్రామికగిరిజన కుటుంబాలను ఎలా ఆదుకోవాలి...? ప్రపంచంలో భారత దేశాన్ని ఒక ప్రభలమైన ఆర్థిక శక్తిగా, ఆదర్శంగా, అన్నదాతగా అన్నపూర్ణలా ఎలా తీర్చిదిద్దుకోవాలి...? "అందుకు నగదురహిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే శరణ్యం... అన్నదే “భాతరదేశ ప్రధాన మంత్రికి లీగల్ నోటీస్" సారాంశం. భారత దేశ ప్రధాన మంత్రే రాజ్యాంగ ధర్మబద్ధంగా అవినీతులకు అవకాశంలేని నగదురహిత ఆర్థిక వ్యవస్థని తీర్చిదిద్దాలని, అసాంఘిటిక దేశ ప్రజల తరపున కోరుకుంటూ ఈ లీగల్ నోటీస్లో అభ్యర్ధన. లేకపోతే భారత రాజ్యాంగ ధర్మాల్లో అధికరణ 32 ప్రకారం, భారత రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టులో, న్యాయ సమీక్షను కోరుకొనే ప్రజాప్రయోజనాల వాజ్యానికి అనుబంధంగా వాస్తవ ఆధారాలతో చెప్పుకుంటూ వచ్చిందే ఈ లీగల్ నోటీసు. “ఎందుకంటే...? మహత్తరమైన మన భారతీయ సనాతన ధర్మాల్లో మన దేవుళ్ళ సాక్షిగా పుట్టి పెరుక్కుంటూ వస్తున్నదే మన దేశ అవినీతి. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో మిళితమైవుంది. మనం దేవుడికి పెట్టే నైవేద్యాల నుండి పరలోక గతులకు పెట్టే పిండ ప్రదానాల వరకు అడుగడుగునా అవినీతి అన్నీ రంగాల్లో సమంతరంగా కలిసే ప్రయాణిస్తుంది. ఒకప్పుడు డబ్బు మారక రూపంగా లేనప్పుడు అంటరానితనాలు అగ్రకుల వుగ్ర వాదాలతో శ్రామిక జనుల ఉత్పత్తులు శారీరక సేవలు దోచుకున్నది మనిషిలోని అవినీతే. దూపదీప నైవేద్యాలు, యజ్ఞయాగాదులు, భక్తి గీతాలతో వినోదభరితంగా సాగిపోతూ వచ్చింది. ఎప్పుడైతే డబ్బు పెద్ద నోట్ల రూపంలో అపారంగా చలామణిలోనికి వచ్చిందో...? నేరస్తులు, వ్యాపారస్తులు, వ్యభిచారులు తాము ఆక్రమించుకున్న అధికారాలు, దురాక్రమించుకున్న వ్యవస్థలు, అందిపుచ్చుకున్న అవకాశాల్లో ఆకాశాన్నే సరిహద్దుగా మార్చుకున్నది. భారత దేశ ప్రధాన కథా వస్తువుగా మారిపోయింది... అవినీతి. అది రాసేవాడికి కూసేవాడికి గెంతుకుంటూ పాడేవాడికి, సినిమాలు తీసేవాడికి నాలుగు డబ్బులు సంపాదించి పెడుతున్నది. ఛానళ్ళలో బ్రేకింగ్ న్యూస్లుగా మారిపోయింది. ప్రచార ప్రశార సాధనాల్లో మెజార్టీ ప్రజలకు తాము భరిస్తున్న అవినీతే తిరిగి తమ కధా కాలక్షేపాలుగా తయారయ్యింది. అవినీతిని అరికట్టవలసిన పాలక కార్యనిర్వాహక వర్గాలు. నేర పరిశోధక సంస్థలు, పోలీసు బలగాల చేతుల్లోనే అవినీతి నగ్నంగా డబ్బు రూపంలో నాట్యం చేస్తూ కనిపిస్తున్నది. మొత్తంగా చూస్తే అవినీతి పవిత్ర భారత భూభాగంలో ఈ పవిత్రమైన మట్టిలో పుట్టి చిలువలు పలువలతో మహావృక్షంలా పెరిగింది. ఆకాశాన్నే సరిహద్దుగా మార్చుకున్నది. 138 కోట్ల జనాభా కలిగిన 25 కోట్ల కుటుంబాల పవిత్ర భారత దేశం మనది. అందులో 5 కోట్ల దేశద్రోహ కుటుంబాలకు దేవుడిచ్చిన వరంలా మారింది... అవినీతి.