BATHRUHARI SUBHASHITA TRISATHI by AMUDALA MURALI Telugu book cover

BATHRUHARI SUBHASHITA TRISATHI

by AMUDALA MURALI

₹90
In stock · 70 available
PublisherAMUDALA MURALI
LanguageTelugu
నీతి శతకము భర్తృహరి చాలారోజుల క్రితం అంటే సుమారు 2 వేల సంవత్సరాలకు ముందుమాట నందీపురం అనే గ్రామం ఉండేది. ఆవూళ్లో చంద్రవర్ణుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చదువంటే చాలా ఇష్టం. ఆరోజుల్లో ఉన్న చదువుల్లో చాలా వాటిని చదువుకొన్నాడు. ఎంత చదివినా అతనికి చదువుపట్ల ఆసక్తి తగ్గలేదు. రోజు రోజుకు చదువుకోవాలనే కోరిక పెరుగుతూనే ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గురువుల్నందర్నీ కలిసి వారికి తెలిసిన విద్యలన్నీ నేర్చుకొన్నాడు. ఇంకా నేర్చుకోవాలనిపించింది. మంచి గురువుకోసం వెదుకుతూ బయలుదేరాడు. చాలామంది గొప్ప గొప్ప గురువులుగా పేరుపొందిన వారిని కలుసు కొన్నాడు. కానీ, ఏంలాభం? వారికంటే చంద్రవర్ణునికే ఎక్కువ తెలుసు. అలా తిరిగి తిరిగి చివరకు నిరాశతో మళ్ళీ తిరుగుప్రయాణం మొదలు పెట్టాడు. అనేక వాగులు, వంకలు, గ్రామాలు దాటుకొంటూ, ఆయా ప్రాంతాల్లో బాగా చదువుకొన్న వారెవరైనా ఉన్నారేమోనని విచారిస్తూ వస్తున్నాడు. ఇంతలో ఒక అరణ్యమార్గం ఎదురైంది. ఒంటరిగా అడవిగుండా నడక మొదలుపెట్టాడు. ఎంతదూరం నడిస్తే తరువాత గ్రామం వస్తుందో, అడవి పూర్తవుతుందో తెలియదు. వెళ్ళేకొద్ది అడవి చిక్కనవుతూ ఉంది. దూరం నుంచి క్రూరమృగాల అరుపులు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అడవి ఎంత భయంకరంగా ఉందో, అంతే అందంగా కూడా ఉంది. సీతాకోకచిలుకలు, రకరకాల పక్షులు, మొక్కలు, వృక్షాలు, రంగురంగుల పుష్పాలు, పొదలు తీగలు, సెలయేర్లు, అప్పుడప్పుడు ఎదురుపడి చాటుకు గెంతే కుందేళ్ళు, లేళ్ళు వీటన్నిటిని చూస్తూ చంద్రవర్ణుడు చాలా ఆశ్చర్యపోయాడు.