BATHUKATA by DR.V.R.RASANI Telugu book cover

BATHUKATA

by DR.V.R.RASANI

₹150
In stock · 1214 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
BATHUKATA A Noval by Dr. V.R. RASANI రాసాని గారి 'బతుకాట' నవల నిజంగా దృశ్యకావ్యం. ఆయన శైలి, కథనం ఎంతో ఉన్నతంగా ఉ న్నాయి. పుస్తకం మొదలు పెడితే చివరివరకు ఆపకుండా చదివిస్తుంది. త్రీ-డి సినిమాలు చూసిన ప్రేక్షకులకి మామూలు సినిమాలకీ, త్రీ-డి సినిమాలకూ గల తేడా అర్థమవుతుంది. త్రీ-డి చిత్రాలలో లోతు వుంటుంది. అంటే.... దృశ్యం ఒక కాన్వాస్ మీద గీసిన బొమ్మలాగా కాకుండా, మన ముందరే జరుగుతున్నట్లుంటుంది. రాసానిగారి కథనంలో ఈ త్రీ-డి ఎఫెక్టు వుంది. చదువుతుంటే ప్రతి సంఘటనా మన కళ్ళముందే జరుగుతున్నట్లుంటుంది. ఆ పాత్రలను, సంఘటనలనూ మౌనంగా చూస్తున్న పాత్ర అయిపోతాం మనం. ఈ అద్భుత శిల్పాన్ని కథనంలో ప్రవేశపెట్టడం - ప్రజ్ఞ, ఉపజ్ఞ ఉండి, బాగా చేయి తిరిగిన రచయితకే సాధ్యం... 'బతుకాట' నాటి రంగస్థల నాటకాలకు సంబంధించిన ఒక ఎన్సైక్లోపీడియా వంటిది. బతుకాట పేరుకు నవలే కానీ, నిజానికి ఇది నిజమైన వ్యక్తుల జీవిత గాథ. నిజ జీవితాలను కథాత్మకంగా మలచి, నవలీకరణ చేసినట్లు స్పష్టమవుతుంది. జగన్నాటకంలో జీవన నాటకం ఒక అంతర్భాగం. ముఖానికి రంగులేసుకుని, రంగస్థలంపైన గొంతు విప్పి 'అడుగులు' వేయకపోతే తమ బతుకు బండి ఒక అడుగు కూడా ముందుకు సాగలేని కుటుంబాలు ఎన్నో వున్నాయి. తమ బతుకులు కొవ్వొత్తిలా కాలి, కరిగిపోతున్నా ప్రజల్ని ఆనందింప చేయడంలోనే పరమార్థాన్ని వెతక్కునే... అసలు సిసలైన కళాకారుల యథార్థ వ్యథార్థ జీవనగమనమే 'బతుకాట’. - కె. ఆర్.కె. మోహన్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004