
BATHUKU PAYANAM KATHALU
by B.S.RAMULU
₹90
In stock · 8 available
PublisherB.S.RAMULU
LanguageTelugu
మంచికి, కష్టానికి జోహార్లు శ్రీ బి.యస్.రాములు గారి పేరు ఆధునిక సాహితీ లోకంలో సుప్రతిష్టితం. ఆయన మూర్తిమత్వం ఎంతోమందికి ఆదర్శం. ముందుగానే పొగడ్తలతో ప్రారంభించానని అనుకోవద్దు. ఆయనని చూడండి తెల్లటి జుట్టు, తెల్లటిగడ్డం, నవ్వుతున్న ముఖంతో అనుభవాల పంటగా కన్పిస్తారు. వాస్తవానికి సరిహద్దుగా నమ్మకమిస్తారు. ఈ పుస్తకాన్ని చదివితే నేనన్న మాటల్లో ప్రతీ అక్షరానికి సాక్ష్యం దొరుకుతుంది. ఆశలు, అవాంతరాలు, ఆశయాలు, చేదు అనుభవాలు ఆయన మనసుని సుశిక్షణతో ప్రవర్తించేలా చేశాయి. చెప్పడం వరకే గాక భౌతిక శ్రమతో క్రియాశీలక సాఫల్యానికి పురిగొల్పాయి. మనిషికి ప్రధానంగా రెండు పార్శ్వాలుంటాయి. చెప్పేదొకటి చేసేదింకొకటి. వీటికి కవి లేదా రచయిత కూడా అతీతుడు కాదు. ఈ భిన్న పార్శ్వాలు పోషించే వాళ్ళ భావాలు మిణుగురుల వెలుతురులాంటివి. చెప్పిన భావాలని క్రియాశీలకంగా ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు భావితరాలకి పరమాదరణీయమవుతారు. ఆధునిక కాలంలో భవిష్యత్ కీర్తి పతాకని కదపలేనంత కట్టుదిట్టగా పాతుకున్న వారు శ్రీ బి.యస్.రాములు. మొయిలి మోహనరావు ఈ సిద్ధాంత వ్యాసం మొదటి అధ్యాయంలో శ్రీ బి.యస్.రాములు గారి జీవితాన్ని పరిచయం చేశాడు. అధ్యాయంలోని విషయం చదివినపుడు శ్రీ రాములుగారి జీవితంలో ఆటుపోట్లు స్పష్టంగా గుర్తించవచ్చు. వేగవంతమైన ప్రవాహం చిన్న మొక్కని పెకలించి ఎన్ని వైపులకి తోసేసినా ఒక చోట ఒడ్డుపట్టి, మహావృక్షంగా ఎదిగి, దిబ్బకట్టి ప్రవాహాన్ని నిలువరించి ఎన్నో ఫలాల్ని అందించిన స్థాయి బి.యస్.రామలు గారికి అన్వయిస్తుంది. ప్రగతిని పరమావధిగా భావించే వారికి మార్పు అనివార్యం. బి.యస్.రాములు జీవన సాఫల్యంలో ఆ మార్పే కీలక పాత్ర వహించింది.