BEST JOKES by YERRAMSETTI SAI Telugu book cover

BEST JOKES

by YERRAMSETTI SAI

₹150
In stock · 1 available
PublisherINDRADHANASSU PUBLICATIONS
LanguageTelugu
“ఒరే శ్రీనూ! నువ్ రోజూ ఇన్ని తప్పులు ఎలా చేస్తున్నావో నాకర్థం కావటం లేదు. మిగతావాళ్ళను చూడు- చాలా తక్కువ తప్పులు చేస్తున్నారు-” "నేను మిగతా వాళ్ళ కంటె ఒక గంట పెందలాడే నిద్రలేస్తాను టీచర్- అందుకే..” డ్రాయింగ్ టీచర్ సడెన్ గా టెస్ట్ పెట్టింది పిల్లలకు- “మీకు ఒక గంట టైమిస్తున్నాను. ఎవరికిష్టమయిన బొమ్మ వాళ్ళు వేసుకురండి- బొమ్మ అందరికంటే ముందు వేసిన వారికి మంచి బహుమతి ఇస్తా!" అందామె. అందరూ హడావుడిగా బొమ్మలు వేయటం మొదలుపెట్టారు. అయితే చిన్ని అయిదు నిమిషాల్లోనే తను వేసిన బొమ్మ తీసుకెళ్ళి టీచర్ కిచ్చేసింది. టీచర్ ఆశ్చర్యపోయింది. "అదేంటి? అప్పుడే వేసేశావా?” "అవును టీచర్-" ఆ కాగితం ఓపెన్ చేసి దానిమీద అసలు బొమ్మేలేకపోవటం చూసి టీచర్ షాకయింది. "దీనిమీద బొమ్మే లేదుగా?” "ఉంది టీచర్ -” "ఏదీ- కనబడటంలేదుగా- అసలు ఏం బొమ్మవేశావ్ నువ్వు?” "ఆవుగడ్డి తినే బొమ్మవేశాను-” "ఏదీ గడ్డి ఎక్కడ?" "ఆవు తినేసింది కదా- ఇంకెలా కనబడుతుంది టీచర్?” "ఓ - అయితే మరి ఆవేదీ?” "గడ్డి తినేశాక ఇంక అక్కడెందుకుంటుంది టీచర్ వాళ్ళింటికెళ్ళిపోయింది-"