BHAGATHSINGH-DR.CHAGANTI TULASI-25 by DR.CHAGANTI TULASI Telugu book cover

BHAGATHSINGH-DR.CHAGANTI TULASI-25

by DR.CHAGANTI TULASI

₹25
In stock · 2 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఇప్పటి పాకిస్తానులో ల్యాల్లపురం జిల్లా జరవాలా తహసీలులో బంగ అనే ఊరు ఉన్నది. ఆ ఊళ్ళో 1907 సెప్టెంబరు 27, శనివారంనాడు భగత్సింగ్ పుట్టాడు. ఆయన తండ్రి కిషని సింగూ, వినతండ్రి స్వర్ణసింగూ ఇద్దరూ తమ విప్లవ కార్యకలాపాలకుగాను లాహోరు సెంట్రలు జైల్లో ఉన్నారు. ఇంకో పినతండ్రి అజిత్సింగు మండలే జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మండలె బర్మాలో ఉంది. బర్మా అప్పట్లో ఇండియాలో ఓ భాగంగా ఉండేది. ఉదారభావాలు కలవాడు. లాలా అజపత్రాయ్, భాయీ భగత్సింగ్ తాతగారు అర్జునసింగు ఆర్య సమాజంవాడు. ఆయన స్వామి దయానందుణ్ణి కలుసుకున్నాడు. జాతీయోద్యమ కార్యకలాపాలవల్ల పరమానంద్, సూఫీ అంబాప్రసాద్, మహాత్మా హంసరాజులాంటి స్వాతంత్ర్య పోరాటయోధులతో భగత్సింగ్ కుటుంబానికి అతి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ రోజుల్లో యావత్తు పంజాబు అసంతృప్తితో కుతకుతలాడుతోంది. సర్వత్రా సభలు, సమ్మెలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో పుట్టాడని వాళ్ళ మామ్మగారు పిల్లాడికి భగత్సింగ్ అని పేరు పెట్టింది. ఈ పిల్లాడి రాకతో కుటుంబానికి అదృష్టం కలిసి వచ్చిందనీ, తన ముగ్గురు కొడుకులూ జైళ్ళ నుండి విడుదలై వచ్చారని ఆవిడ అనుకుంది. పంజాబీ భాషలో 'భగ' అంటే అదృష్టం అని అర్థం. తనతోపాటు అదృష్టాన్ని తెచ్చాడు కాబట్టి పిల్లాణ్ణి "భగన్వాలా” (అదృష్టాన్ని తెచ్చినవాడు) అని పిలవడం మొదలుపెట్టారు. భగత్సంగ్ అన్నగారి పేరు జగత్సింగ్. అంచేత ఇద్దరి పిల్లల పేర్లూ ప్రాసకలిసేటట్టు ఈ పసిపిల్లాడికి ముద్దుగా భగత్సింగ్ అని పేరుపెట్టారు. పంజాబీ కుటుంబాల్లో ప్రాసకలిసే పద్ధతిలో పిల్లలకి పేర్లు పెట్టడం అన్నది రివాజు. భగత్సింగ్ అమ్మగారి పేరు విద్యావతి. ఆవిడ మహా ధైర్యవంతురాలు, సాహసవంతురాలూను. చెప్పరానన్ని కష్టాలు పడ్డది.