
BHAGAVADGITA-80
₹80
In stock · 5 available
PublisherDAGGUPATI VENKATESWARLU
LanguageTelugu
తొలిపలుకులు భగవద్గీత భారతీయులకు పరమపవిత్రగ్రంథము. ఇందలి విషయాలు జాతి, కుల, మత, స్త్రీ పురుష భేదం లేకుండా తెలుసు కోవలసినవి. ఈ పవిత్రమైన గ్రంథాన్ని చదివినా, వినినా వేయిగోవుల దానముల వలన కలుగు పుణ్యం లభిస్తుందని మహాపండితులు సూచించారు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ దుష్టులను శిక్షించి, సన్మార్గులనూ, ధర్మపరులనూ రక్షించి, ధర్మాన్ని రక్షించుటకు అప్పుడప్పుడు మానవ శరీరంతో భూలోకంలో అవతరించుతానని పలుమార్లు తెలియజేసిన విధంగా, దేవకీ వసుదేవులకు కారాగారమందు జన్మించాడు. బాల్యంలోనే పూతన మొదలైన రాక్షసులను ఎందరినో సంహరించి తనతోటి వారికి కలిగిన భయభ్రాంతులను తొలగించాడు. ధర్మపరులూ, నీతివంతులూ అయిన పాండవులను కాపాడటానికి వారి పక్షముచేరి దుర్మార్గులూ, అన్యాయపరులూ అయిన కౌరవులను రూపుమాపి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. కౌరవులు, పాండవుల మధ్య యుద్ధం జరగటానికి కురుక్షేత్రయుద్ధభూమిలో సర్వం సిద్ధముగా యున్నది. ఇరుపక్షాలు తమ తమ సైన్యాన్ని యుద్ధ వ్యూహాలతో మోహరించియున్న సందర్భంలో పాండవులలో మధ్యముడు, వీరుడు, అరివీరభయంకరుడైన అర్జునుడు ఇరువర్గాలసైన్యాన్ని పరిశీలనగా చూచి అందులో యుద్ధ వీరులుగా ఉన్న పితామహుడు భీష్మా చార్యులూ, గురువు గారైన ద్రోణాచార్యులూ, కృపాచార్యులూ, అన్న దమ్ములూ, బావలూ, మామలూ, కుమారులు మొదలైన వారందరినీ చూచి కలతచెందిన మనస్సుతో వీరందరినీ యుద్ధంలో హతమార్చి నేను పొందే సుఖం కంటే బిచ్చమెత్తుకొని బ్రతుకుటమేలు అని విలపించుతూ, నేను ఈ యుద్ధం చేయను అని తనకు రథసారధిగా ఉన్న శ్రీకృష్ణ భగవానునికి తెలియజేస్తాడు. ఆ విధంగా పిరికితనం అవహించిన అర్జునునకు తన కర్తవ్యాన్ని బోధించుతాడు భగవానుడు.