
BHAGAVADGITA DWARA VYAKTHIGATA NAIPUNYA VIKASAM
₹200
In stock · 8 available
PublisherSWAMI SUKHABODHANANDA
LanguageTelugu
స్పృహ - అంతర్గత రసవాదం ఇప్పుడు, మన సంవత్సరాలకు జీవితాన్ని అదనంగా కలపడానికి నిజంగా ఏం కావాలి? అందుకు ఒక స్థాయి లోతైన స్పృహ కావలసివస్తుంది. ఆ స్థాయి లోతైన స్పృహ లేనట్టయితే, మీరు పెరుగుతున్నట్టు భావించవచ్చు. నిజానికి మీకు వయసు మాత్రమే పెరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అందువల్ల మొత్తం తత్వశాస్త్ర ప్రధాన వాక్యాల్ని ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే- అది స్పృహ తప్ప మరొకటి కాదు. ఆ తరవాత రెండవ స్థాయిలో మీ అనుదిన నిత్య జీవితంలో ఈ స్పృహను ఎలా తీసుకుని, ఎలా ఉపయోగిస్తున్నారు అన్నవి ముఖ్యం. ప్రతిభాశాలి అయిన ఒక సంగీత విద్వాంసుడు తన స్పృహను అభివృద్ధి పరచుకుని శబ్దాలను మృదుమధుర సంగీతంగా మార్చడం లాంటిదే అది. కేవలం స్పృహతోనే అతడు శబ్దాలను సంగీతంగా మారుస్తాడు. అలాగే అంతర్గతంగా మేల్కొన్న ఒక వ్యక్తి అనుభవాలను స్పృహతో తీసుకుని, వాటిని సామరస్యంగా అమర్చి జీవన సంగీతాన్ని సృష్టిస్తాడు. అందువల్లే వేదం “రసోవై సహః" అని చెబుతోంది. ఎలా చెయ్యాలో తెలుసుకుంటే అది అత్యంత రసవంతంగా తయారవుతుంది. మీరు మీ అనుభవాలను మార్చుకోవలసిన పని లేదు. మనం మామూలుగా మన అనుభవాలను మార్చుకోవడంలో బిజీగా తలమునకలుగా వుంటాం.