BHAGAVADGITA SAVIMARSHAKA PARISHEELANA by VALLAMPATI VENKATA SUBHAIAH Telugu book cover

BHAGAVADGITA SAVIMARSHAKA PARISHEELANA

by VALLAMPATI VENKATA SUBHAIAH

₹50
In stock · 140 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందుమాట భారతీయులకు భగవద్గీత ఒక పవిత్ర గ్రంథం. పండితులు, పామరులు అన్న తేడా లేకుండా అందరూ దాని ప్రభావానికి లోనయ్యారు. అక్షర జ్ఞానం లేని సామాన్య భారతీయుడు కూడా గీతాతత్వాన్ని తన సొంత పద్ధతిలో ప్రతిపాదించగలడు, గీతకు అనువాదాలూ, గీతమీద వ్యాఖ్యానాలూ భారతీయ భాషల్లోనే కాకుండా ప్రపంచంలోని ప్రసిద్ధ భాషలన్నిటిలోనూ దొరుకుతున్నాయి. ప్రతి సంవత్సరమూ కొత్త కొత్త విద్వాంసులు కొత్త కొత్త దృష్టి కోణాలను ప్రతిపాదిస్తూనే ఉన్నారు. ఇది ఈ గ్రంథానికున్న జనప్రియత్వాన్ని తెలియచేస్తుంది. గీతను చదివే వ్యక్తినీ, దాన్ని వినే వ్యక్తినీ ఏకకాలంలో మంత్రముగ్ధుల్ని చేయగల ఆకర్షణీయమైన భాష గీతలో ఉంది. అందులోని సంస్కృత శ్లోకాల అర్థాన్ని తెలుసుకునే గొడవ జోలికి పోకుండా దాన్ని చదవటంలోనూ, వినడంలోనూ అనేకులు సంతృప్తి పడతారు. అంతే కాకుండా అనేక పదాలకు రూఢి అయిన ఒక అర్థం కాకుండా అనేక అర్థాలుండటం సంస్కృత భాషకున్న ప్రత్యేకత, సౌందర్యం, ఆ అర్థాలు ఒక్కొక్కసారి పరస్పర విరుద్ధంగా కూడా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో పాఠకుడు తనకు అనుకూలంగా ఉన్న అర్థాన్ని కల్పించుకొని సంతృప్తి పడతాడు. ప్రాచీన భారతదేశంలో గీతారచనకు పూర్వం వికాసం పొందిన అనేక తాత్విక సంప్రదాయాలు భగవద్గీతలో ప్రాతినిధ్యాన్ని పొందాయి. విభిన్న తాత్విక సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు గీతలో తమతమ తత్వాలే ప్రతిపాదించబడ్డాయని తమ తమ దృష్టి కోణాల నుంచీ గీతకు టీకా తాత్పర్యాలు రాశారు. మహాత్మాగాంధీకీ, అతని హంతకుడు నాధూరాం గాడ్సేకూ కూడా భగవద్గీత పవిత్ర ధార్మిక గ్రంథమే. గాంధీజీ గీతను తన జీవితంలోని క్లిష్ట సమయాల్లో దారి చూపే విశ్వకోశంగా పరిగణించారు. తాను గాంధీజీని హత్య చేసి న్యాయస్థానంలో నేరారోపణను ఎదుర్కొంటూ, తాను చేసిన హత్య న్యాయ సమ్మతమైందేనని సమర్ధించుకోవడం కోసం గాడ్సే భగవద్గీత శ్లోకాలను ఉటంకించాడు.