BHAGAVADRAJYANGAME BHAGAVADGITA - 190 by CHODAVARAPU KRISHNA MURTHY Telugu book cover

BHAGAVADRAJYANGAME BHAGAVADGITA - 190

by CHODAVARAPU KRISHNA MURTHY

₹190
In stock · 51 available
PublisherCHODAVARAPU KRISHNA MURTHY
LanguageTelugu
ముందుమాట భగవద్గీత అంటే భగవంతుడు ఉపదేశించిన జీవన విధానం. సకల చరాచర ప్రాణులలోకి ఉత్తమోత్తమ జన్మ అయిన మానవ జన్మనెత్తిన వారికి, తను పరమాత్మ అంశ అయిన ఆత్మనని తెలియచేసే గ్రంధమే భగవద్గీత. మానవత్వముతో జన్మించిన మానవులు, సాధన ద్వారా మానవత్వమును పెంపొందించుకొని దైవముగా మారి, దేవదేవుని సాన్నిధ్యములోకి చేరు మార్గమును బోధించునదే భగవద్గీత. మార్గము తెలియని అజ్ఞానులు కామమును పెంపొందించుకొని మృగత్వమును లేక రాక్షసత్వమును పొంది మృగములుగా లేక రాక్షసులుగా జీవించుచూ, ప్రారబ్ధముగా ప్రాప్తించు కర్మలను ఆచరిస్తూ మరియు ప్రారబ్ధంగా ప్రాప్తించు కర్మ ఫలములను అనుభవిస్తూ జననమరణ చక్రంలో పరిభ్రమించుచూ, పతనమొందుచున్న మానవులను ఉద్ధరించుట కొరకు భగవానుడు శ్రీకృష్ణుడుగా భూలోకములో అవతరించి, అర్జునుని నిమిత్తముగా చేసుకొని సర్వ మానవాళికి ఉపదేశించిన బ్రహ్మవిద్యయే భగవద్గీత. భగవద్గీత సనాతన ధర్మమును బోధించును. సనాతన ధర్మము అనగా శాశ్వత ధర్మము. ఇది ఒక మతమునకు, దేశమునకు, ప్రాంతమునకు, వర్ణమునకు, కులమునకు, భాషకు, లింగమునకు మాత్రమే సంబంధించిన ధర్మము కాదు. అనేకమంది మహర్షులు పరమాత్మ తత్త్వమును, ఆత్మ తత్త్వమును తెలుసుకొనుటకు అనేక వేల సంవత్సరములు పరమాత్మ ధ్యానములో ఉండి, సమాధిస్థితిలో పరమాత్ముని ద్వారా విన్నవాక్కులతో రచించిన వేదములు, ఉపనిషత్తులు, ధర్మసూత్రములు మరియు ఇతిహాసములైన మహా రామాయణం, మహాభారతం, మహా భాగవతం, అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు మొదలగు అనేక గ్రంధాలలో బోధించిన ధర్మశాస్త్రముల సారమే భగవద్గీత.