
BHAGAVATHKRUPA (AADHYATMIKA VYASA SAMPUTI)
₹100
In stock · 1 available
PublisherMAHABHASHYAM NARASIMHA RAO
LanguageTelugu
నా మాట పురాణ కధలు, ధర్మశాస్త్ర విశేషాలు, మహనీయుల గురించిన జీవిత విశేషాలు, కొన్ని యాత్రా విశేషాలు, దేవాలయాల ప్రాశస్త్యం మున్నగు విషయాలనెన్నో తెలియజేసేప్రయత్నమే ఈ భగవత్కృప! దీనితోపాటు అవసరమైన చోట అనేక ఇతర అంశాలను విశ్లేషిస్తూ, వివరిస్తూ ధర్మసూక్ష్మాలను, కథలను వాస్తవ సమీపమైన కల్పనలను జోడించి సామాన్య పాఠకులకు సైతం అర్థమయే రీతిలో, సులభ శైలిలో వ్రాసిన అనేక ఆధ్యాత్మిక వ్యాస సంపుటిని అందిస్తున్నాను. తెలిసీ తెలియక తప్పులు దొర్లితే పాఠకులు సహృదయంతో మన్నించ ప్రార్ధన! భగవత్కృప లేనిదే మానవుడు ఒక్క అడుగు ముందుకు వేయలేడు. దైవకృప లేనప్పుడు మానవ ప్రయత్నం ఎంత చేసినా నిష్ప్రయోజనమే! నేను వ్రాసిన ఆధ్యాత్మిక వ్యాస సంకలనాన్ని పుస్తకంగా కూర్పుచేయాలని ఆలోచన ఉన్నా పుస్తక ముద్రణ వ్యయం, సాధక బాధకాల గురించి తెలిసినందున మిన్నకుండి పోయాను. ఒక రోజు సాయంత్రం వాహ్యాళికి వెళుతూ మిత్రుడు శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు గారింటికి వెళ్ళేను. ఆయన ఆనందంగా తను కొత్త పుస్తకం ముద్రిస్తున్నట్లు, పుస్తక ముద్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆర్ధిక సహాయం అందజేసినట్లు తెలుపడంతో నేను కుతూహలంతో వివరాలు సేకరించి, అతని ప్రోత్సాహంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నా వినతి పత్రంతో పాటు నా వ్యాస సంకలనాన్ని పంపేను. శ్రీనివాసుని కృప సంపూర్ణంగా ఉండడంవలన నా 'భగవత్కృప' పుస్తక ప్రచురణకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంగీకరించి, ఆర్థిక సాయం అందించడం ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది భగవత్కృప కాక ఏమనాలి? తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ముందుగా నా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రోత్సాహాన్ని అందించిన మిత్రుడు శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు గారికి ధన్యవాదములు.