
BHAGYANAGARAKOKILA
₹125
In stock · 6 available
PublisherNAYANI SUBBARAO
LanguageTelugu
ముందుమాట శ్రీ నాయని సుబ్బారావుగారి శతజయంతి (1899–1999) ప్రచురణ ఈ కావ్యం. కవి పుట్టిన ఊరు ఇప్పటి ప్రకాశంజిల్లాకు చెందిన పొదిలె గ్రామం. ఆయన ప్రాథమిక విద్య పొదిలెలో, హైస్కూలు చదువు ఒంగోలులో, డిగ్రీ చదువు బందరులో, పూర్తి చేసుకుని నరసరావుపేట పురపాలకోన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి అక్కడే పదవీ విరమణ చేశారు. తరువాత హైదరాబాదు చేరుకున్నారు. కోస్తా పట్టణాలనుండి తెలంగాణా నగరానికి వచ్చి పడ్డ యీయనకు మొదట హైదరాబాదు వాతావరణం, ఇక్కడి జనం, వారి వేష భాషలు కొత్తగా కనిపించసాగాయి. ఒక రకమైన కదలిక ఆయనలో కలగడానికి ఈ హైదరాబాదు ప్రేరణనిచ్చింది. హృదయ సంబంధియైన ప్రేమ, అనురాగం కారణాలుగా చలించి పోయిన ఆయనలోని కవితాత్మ ప్రేయసినీ, తల్లినీ ప్రధాన పాత్రలుగా చేసి ఆయనచేత రెండు ఉత్కృష్ట కావ్యాలకు రూపురేఖలు దిద్దించింది. అవి, తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎప్పటికీ ఆరని కాంతుల్ని ప్రసరించే సౌభద్రుని ప్రణయయాత్ర, మాతృగీతాలు ! 1922లో ఆరంభమైన యీ కవి కవితా ప్రస్థానం 26 నాటికి ఈ రెండు కావ్యాల ఆవిష్కారంతో ఆగిపోయింది. తరువాత ఆయనలోని కవితా ప్రవృత్తిని ప్రేరేపించే నేపథ్యం 1957లో ఆయన హైదరాబాదును మెట్టిన తరువాతగాని ఒనగూడలేదు. ఇందుకు బలమిచ్చే సాక్ష్యంగా కవి మాటలనే ఇక్కడ పేర్కొనవచ్చు. భాగ్యనగరకోకిల పీఠికలో 1957 లో నేను హైదరాబాదుకువచ్చి వేయుట తటస్థించినది.