
BHAJAGOVINDAM - 75
by DR.NANDAMURI LAKSHMI PARVATHI
₹75
In stock · 6 available
PublisherRUSHI PRACHURANALU
LanguageTelugu
"భజ" గోవిందం దీర్ఘస్థ భారతీయ వాఙ్మయంలో ప్రముఖస్థానాన్ని ఆక్రమించి భక్తి సాహిత్యం. భరతఖండంలో ముఖ్యంగా ద్వైతాద్వైతవిశిష్టాద్వైతమతాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఒకప్పుడు మతాంతరాలవల్ల వైదిక మతానికి విఘాతం కలుగుతూంటే తన్నివారణార్థం శంకరుడే శంకర భగవత్పాదులుగా అవతరించి, అన్య దుర్మతాలను ఖండించి అద్వైతమతాన్ని నెలకొల్పారని ప్రతీతి. శ్రీశంకర భగవత్పాదులు అద్వైతమత వ్యాప్తికై ఎంతో పాటుపడ్డారు. ప్రస్థాన త్రయమునకు భాష్యములు రచించారు. ఎంతోభక్తి వాఙ్మయాన్ని సృజించారు. శివకేశవా ద్వైతభావనతో ఎన్నో స్తోత్రాలు రచించారు. సర్వదేవతా సామరస్యాన్ని నెలకొల్పారు. ఇలా పరమ శివావతారులైన శ్రీశంకర భగవత్పాదులు లోకానుగ్రహబుద్ధితో చెప్పిన ప్రకరణ గ్రంథాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిల్లో ఈ భజగోవిందం జగత్ప్రసిద్ధమైనది. ఈ స్తోత్ర గ్రంథం ఆకృతిలో చిన్నదైనా, అర్థగాంభీర్యంలో, వైరాగ్య ప్రబోధంలో అత్యున్నత స్థానాన్ని అందుకున్నది. ప్రతి భారతీయుని నోట భజగోవింద శ్లోకాలు విన్పిస్తుంటాయి. ఈ శ్లోకాలు భారతీయేతరుల మనస్సులను కూడ అయస్కాంతంలాగా ఆకర్షించాయి. ఇవి ఉపనిషత్ తత్త్వాన్ని మననం చేసుకోవడానికి ఎంతో ఉపకరిస్తాయి. హాయిగా పాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.