
BHAKTHULA BHAVALALO SHIRID SAI
₹100
In stock · 47 available
PublisherDUBAGUNTA RAMAKRISHNA
LanguageTelugu
ISBN9788170072751
ముందుమాట (నామాట) సాయిదాస్ (గాజుల శ్రీనివాస్) శ్రీశైలం ప్రాజెక్టు "భక్తుల భావాలలో శిరిడిసాయి” అనే ఈ ఆధ్యాత్మిక గ్రంధం శ్రీసాయిభక్తుల భావాలకు అతి సమీపంగా ఉంటుందని చెప్పనవసరం లేదనుకుంటా! ఎందుకంటే గ్రంధం యొక్క పేరే ఆసత్యాన్ని తెలియజేస్తుంది. నిజానికి శ్రీ దూబగుంట రామకృష్ణ గారు ఈ గ్రంధానికి పేరు నిర్ణయించమని నన్ను అడిగారు, అది సాధారణ సాయిభక్తుల భావాలకు దగ్గరగా ఉండాలని కోరారు, అది నా వల్ల కాలేదు. “శ్రీశిరిడిసాయి సూక్తి సుధా ప్రకాశం" అని లేదా “ముక్తి సుధా ప్రకాశం" అని లోతైన, గంభీరమైన పేర్లు ఏవోసూచించాను, వారు మరికొంత సరళమైన పేర్లు సూచించమన్నారు నావల్లకాదు, మీరే ఆలోచించండి. అటువంటి పేర్లు నిర్ణయించటంలో మీరే సిద్ధహస్తులు అన్నాను, ఎందుకంటే “శిరిడీ సాయి ఎందుకో ఈతరానికి ఆరాధ్యుడు" అనే చిత్రమైన టైటిల్తో వ్యాసరచన పోటీలు నిర్వహించి, అందు గెలిచిన వారిరచనలతో అదేపేరు మీద గ్రంధం ముద్రించిన సమర్థులు వీరు, ఈ వ్యాసరచనా సమయంలోనే వీరితో పరిచయం అయింది. ఈ గ్రంధావిష్కరణ హైదరాబాద్ లోని "త్యాగరాయ గానసభ”లో జ్ఞానపీఠం అవార్డు గ్రహీత డా||సి. నారాయణ రెడ్డి గారి చేతులమీదుగా జరిగింది. ఆసమయంలోనే వీరిని దర్శించే అవకాశం కలిగింది. మొదటి కలయికలోనే వీరు సహృదయులని, ప్రేమ స్వరూపులని గ్రహించాను. “శిరిడిసాయి ఎందుకో ఈతరానికి ఆరాధ్యుడు" అనే గ్రంధాన్ని 50 వేల రూపాయలపై చిలుకు ఖర్చుపెట్టి ముద్రింపజేసారు. అది బాబాగారి యందు వారికున్న అభిమానాన్ని, భక్తి, శ్రద్ధలను తెలియజేస్తుంది. గురుసేవకు ధన, మాన, ప్రాణాలను అర్పించాలనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నంగా కనిపించింది. అందుకు వారు ఎంతయినా అభినందనీయులు. "శిరిడీ సాయి ఎందుకో ఈ తరానికి ఆరాధ్యులు" అనే ఈ గ్రంధం బాబాగారిపై రచింపబడిన ఆణిముత్యాలవంటి 10 గొప్ప గ్రంధములలో ఇది ఒక గ్రంధం కాగలదని నా ప్రగాఢ విశ్వాసం.