BHAMA PRALAPAM by HYMA BHARGAV Telugu book cover

BHAMA PRALAPAM

by HYMA BHARGAV

₹80
In stock · 40 available
PublisherHYMA BHARGAV
LanguageTelugu
ఇల్ 'ఆల్' ముచ్చట్స్ ఆవకాయ దగ్గరినుంచి ఆటంబాబు వరకు ఆల్ ముచ్చట్స్తో అలరిస్తూ, వినోదాల విందులు వడ్డిస్తూ, బోరు రచనల బారి నుంచి మము బ్రోచే 'సీతమ్మ' కలం ఘలఘలలు', దీపావళి వొస్తుందంటేనే చాలు పిల్ల వెధవలకి, ఆడాళ్ళకు కోరికలే గుర్రాలైతే, మగాళ్ళకు బి.పి. రెయిజైపోతుంది. కొత్తల్లుడు కొమ్మెక్కి కూర్చుని సవాలక్ష కోరికలు కోరుకుంటాడు. అవి తీర్చకపోతే గంజి పెట్టిన పోలీసు ఖాకీనిక్కరులా నీలుక్కుని కూర్చుంటాడు. మావగారు చేసిన అప్పులు 'ఎందెందు వెదకిజూచిన అందందే' వుంటాయి. నూతన వధువుకు సిగ్గులతో బుగ్గలు ఎర్రబడతాయి. ఒక్కొక్కరిది ఒక్కో అవస్థ. మా చిన్నప్పుడు పండగంటే ఇంటికి నిజమైన కళ వచ్చేది. తలకు నూనె అంటుకోవడం, శీకాయపొడితో తల రుద్దుకోవడం ఇదంతా ఓ తతంగం. ఇప్పుడు అంత ఓపిక ఎవరికుంది. జగమంతా షాంపూలమయం. అత్తారింటి కొచ్చిన అల్లుడికి బూరెలు, పాయసం, గారెలు చూస్తే చాలు కడుపు నిండేది. పంచెల చాపే పదివేల నుకునేవాడు. ఇప్పటి మోడ్రన్ అల్లుళ్ళకి పంచెల చాపిస్తే వడియాలు పెట్టుకోమని మొహాన విసురుతారు. సినిమాలలో చూపించే దీపావళిలో అప్పులు, ఆకలిదప్పులు వుండవ్. సొమ్ము నిర్మాతదైతే సోకు హీరో హీరోయిన్లది. పిల్ల వెధవలకు కాకరొత్తులు, చిచ్చుబుడ్లు కొనిచ్చేసరికి మన బడ్జెట్ బరువౌతుంది. ఆ సత్యభామ నరకాసుడితో యుద్ధం చేస్తే ఈ కాలం భామలు పెరుగుతున్న ధరలతో ఫైట్ చేస్తున్నారు. నరకాసురుడు నేలవాలాడు కానీ ధరలు మాత్రం 'దిగిరాము దిగిరాము' దివి నుంచి భువికి అంటున్నాయి. అఖిలాంధ్ర ఆడపడుచుల సంఘం అన్నగారికి విజ్ఞప్తి చేస్తే కిలో టపాకాయలు రెండ్రూపాయలకు ఇప్పించే హామీ ఇచ్చెయ్యగల్రు.