BHAMVARA NAALA BEBBULI by VEDULA CHINNA VEENKATA CHAYANULU Telugu book cover

BHAMVARA NAALA BEBBULI

by VEDULA CHINNA VEENKATA CHAYANULU

₹150
In stock · 9 available
PublisherVEDULA CHINNA VEENKATA CHAYANULU
LanguageTelugu
అనువాదకుని ముందుమాట అవి బ్రిటిష్ పాలన రోజులు. హైస్కూలు చదువే గగనము. హై స్కూలు పాసయో లేక అవకనో చాలామంది మధ్యతరగతి సంసా రాలలో పుట్టినవారికి బ్రిటిష్ రైల్వే కంపెనీ నౌకిరీవే శరణ్యము. ఈ కథా సంకలనము లోని కథలన్నీ ఒక బ్రిటిష్ రైల్వే కంపెనీలో స్టే షన్ మేష్టారుగా శ్రమించి, శ్రద్ధగా పనిచేసి పైవారి మన్నన లందు కుంటూ ఆదర్శ వ్యక్తిగా, సహాయము కోరిన వారికి కాదు, లేదు అనక తిరిగి వారి వద్దనుంచి ప్రతిఫలము ఏమీ కోరని శంకరుని సంసార, ఉద్యోగ, సంబంధిత వింతలు, విడ్డూరాలు. అతని కన్ని విధాలా చేదోడు వాదోడుగా, సహధర్మ చారిణిగా, పక్కన నిలబడి ఒబ్బిడిగా సంసారము సాగించిన అతని భార్యా లక్ష్మిల సంసార యాన కనులకు కట్టినట్లు రూపొనరించిన, ప్రశంస నీయ కథావళి. రచయిత అన్నవరపు రామారావు గారి నాన్నగారు శంకర్ వంటి స్టేషన్ మేష్టారు. రామారావు గారు పెరిగి కాలేజీ చదువు వేళకు ఇండియా స్వతంత్ర ప్రజారాజ్యముగా వెలసింది. రామారావు గారు ఎమ్మెస్సీ వరకు చదివి, ఇండియన్ రైల్వే ట్రాస్పోర్టేషన్ ఎన్డ్ కమ ర్షియల్ సర్వీసెస్ కి సెలక్ట్ అయి రైల్వే 'ఆపరేషన్స్ ఎక్స్పర్ట్' గాను