
BHARAT RATNA MOKSHAGUNDAM VISVESVARAIAH - 60
₹60
In stock · 637 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మొగ్గతొడగడం - వికసించడం "భగవంతుడు తనను తాను ఎల్లెడలా నిరూపించుకుంటాడు" -టెన్నిసన్ మోక్షగుండం విశ్వేశ్వరాయ మైసూరు సంస్థానంలోని కోలారు జిల్లా చిక్కబళ్ళాపుడ తాలుకాలోని ముద్దేనహళ్ళిలో 1861 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించారు. ఆ గ్రామం బెంగళూరు నుండి 30 మైళ్ళ దూరంలో ఉంది. అతని తండ్రి శ్రీనివాసశాస్త్రి; తల్లి వెంకటలక్షుమమ్మ. 'సంస్కృత విద్వాంసులు, హిందూధర్మశాస్త్రాలపై దిట్ట. ఆయుర్వేద వైద్యులు కూడా. వెంకటలక్షుమమ్మ తమిళనాడు ప్రాంతానికి చెందిన వారు. విశ్వేశ్వరాయ జీవితాన్ని మంచికి మలచిన దొడ్డ తల్లి. మోతీలాల్ నెహ్రూ (జవహర్లాల్ నెహ్రూ తండ్రి), మదనమోహన మాలవ్య, (బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకులు), విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ లాంటి మహనీయులు 1861వ సంవత్సరంలోనే జన్మించడం గమనార్హం. విశ్వేశ్వరాయ పూర్వీకులు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. 17వ శతాబ్దంలో విశ్వేశ్వరాయ తాతగారు కుటుంబంతోపాటు ముద్దేసహళ్లి చేరారు. అక్కడే విశ్వేశ్వరాయ జన్మించారు. విశ్వేశ్వరాయ జననీ జనకులు యాత్రలు చేస్తూ కంచికామకోటి పీఠాధిపతుల ఆశీస్సులందుకున్నారు. జంబుకేశ్వర సమీపంలోని తిరువన్ కావల్ ఆలయాన్ని దర్శించారు. యాత్రలో భాగంగా రాయచూర్ పర్యటనలో ఉన్నప్పుడు శ్రీనివాసశాస్త్రిగారు స్వర్గస్తులయ్యారు. విశ్వేశ్వరాయ పాఠశాల విద్య చిక్కబళ్లాపూర్లో జరిగింది. ఆయన క్రమశిక్షణ, శ్రమించే గుణం, వినయ విధేయతలను చూసి ఉపాధ్యాయుడు నాదమునినాయుడు మెచ్చుకున్నారు. మంచి పుస్తకాలను చదివే అలవాటును పోషించినవారు నాదముని నాయుడు. మరొక ఉపాధ్యాయుడు కృష్ణగిరి రాఘవేంద్రరావుగారు విశ్వేశ్వరాయ సద్గుణములను ప్రశంసించేవారు. విద్యార్థిగా తరగతిలో రాణించేవారు విశ్వేశ్వరాయ. అప్పట్లో ఉపాధ్యాయుల వేతనాలు చాల తక్కువగా ఉండేవి. కుటుంబ పోషణ భారం కావడంతో రాఘవేంద్రరావు తన ఉద్యోగానికి రాజీనామాచేసి బెంగళూరు వెళ్లారు. న్యాయ కళాశాలలో చేరి పట్టభద్రులై బెంగళూరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. బాగానే సంపాదించేవారు. ఒకరోజు ఉదయం రాఘవేంద్రరావు బెంగళూరులోని చిక్పేటలో పాదచారియై పోతూండగా, ఆకస్మికంగా ఒక గుర్రపు బండి రాఘవేంద్రరావు గారి సమీపంలో నిలిచింది. విదేశీ దుస్తులు, మైసూరు తలపాగాతో ఉన్న ఒక వ్యక్తి గుర్రపు బండి నుండి దిగాడు. ఎంతో వినయంగా రావుగారికి నమస్కరించాడు.