
BHARATEEYA DARSHANAM
₹350
In stock · 503 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126351
BHARATEEYA DARSANAM by Rahul Sankrityayan Translated by Aluri Bhujanga Rao రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్కృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్ర్య యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య భాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిందూ సన్యాసిగా, ఆర్యసమాజకునిగా, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్ధభిక్షువుగా ఈయన పేరు పొందారు. వీరు చేసిన భాషాసేవకు కాశీ పండితులు వీరిని “మహాపండిత్” బిరుదుతో గౌరవించారు. బౌద్ధవేదములు మూడింటిలోను ఈయన నిధి. అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు "త్రిపీఠకాచార్య" బిరుదు నిచ్చారు. రాహుల్లో సాగించిన పరిశోధనలు భారత సంస్కృతిని 600 సం||లు చరిత్రలో సుసంపన్నం చేశాయి. వీరి రచనలు హిందీ భాషకు 400సం||ల చరిత్రను చేర్చాయి. వాటిలో హెచ్చువాటిని జైళ్ళలోను లేక నేపాల్, టిబెట్, సిలోన్లలో రచించారు. వివిధ భాషలలో వీరి గ్రంథాలు 60 కి పైగా వుంటాయి. తెలుగు పాఠకులకు సుపరిచితమైన “భారతీయ దర్శనం" రచనను 1942 సం||లో రాశారు. రాహుల్తో రచనలలో సుప్రసిద్ధమైనవి కొన్ని... ఋగ్వేద ఆర్యులు జయయౌధేయ మధుర స్వప్నం దివోదాసు - లోకసంచారి విస్మృత యాత్రకుడు ఓల్గా నుంచి గంగకు మధుపురి సింహ సేనాపతి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN 978-93-48126-35-1