BHARATEEYA NAVALA DARSHANAM by VADREVU VEERALAKSHMI DEVI Telugu book cover

BHARATEEYA NAVALA DARSHANAM

by VADREVU VEERALAKSHMI DEVI

₹350
In stock · 1 available
PublisherVADREVU VEERALAKSHMI DEVI
LanguageTelugu
ఇటువంటి ఒక అవకాశం దొరికినప్పుడు మరెవరైనా సరే ఇంత పెద్ద ప్రయాణం చెయ్యగలరో లేరో కానీ నేను చేశాను. అది కాలాన్నీ దూరాన్నీ ఓడించిన ప్రయాణం. వందేళ్లకాలం వెనక్కి వెళ్లాను. తూర్పు పడమర, ఉత్తర దక్షిణాల మధ్య విస్తరించిన భారతదేశమంతటా తిరిగాను అక్షరపారావతాల మీద. పంజాబు సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా... అంటూ పదమూడు భాషల నవలా సాహిత్యాలు చదువుకుంటూ దాదాపు ఏడేళ్లపాటు నేను చేసిన చిర దీక్షా తపస్సు ఇది. అదంతా ఈ పుస్తకంలో ఉంది. ఒక ఉపేంద్రకిషోర్ దాస్, ఒక కాళిందీ చరణ్ పాణిగ్రాహి, అటు అస్సామీ రచయిత్రి ఇందిరా గోస్వామి నుంచి ఇటు గుజరాతీ రచయిత్రి కుందనికా కపాడియా దాకా ఇందులో ఉన్నారు. ఇటు తక్కళి, శివరామకారంతల నుంచి బిభూతి భూషణ్ మీదుగా ఎస్.ఎల్. భైరప్ప వరకూ చేసిన నవలా ప్రపంచదర్శనం ఇందులో ఉంది. ఆంగ్లాంధ్ర రచయితల నవలా సారాంశాలు నివేదించడంలో నేను ఏమరుపాటుకు లోను కాలేదు. వంద సంవత్సరాలపాటు భారతీయభాషల రచయితలు చూపించిన సమగ్ర భారతీయ సంస్కృతిని ఈ అరవై నవలల పరిచయాల ద్వారా మీకందించే ముందు దానినంతటినీ నేను సమగ్రంగా ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పుడు దాన్ని అంతటినీ ఇలా పదిలంగా మీ చేతుల్లో పెడుతున్నాను. అలాంటి అరుదైన అవకాశాన్నిచ్చిన సాహిత్య పత్రిక 'చినుకు' చిరకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.