BHARATHA DARSHANAM - 700.00 by JAWAHARLAL NEHRU Telugu book cover

BHARATHA DARSHANAM - 700.00

by JAWAHARLAL NEHRU

₹700
In stock · 494 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
BHARATHA DARSANAMU Jawaharlal Nehru జవహర్లాల్ నెహ్రూ జననం : 14 నవంబర్ 1889. కాశ్మీర దేశస్థులు. తండ్రి మోతీలాల్ నెహ్రూ, ప్రఖ్యాత న్యాయవాది. తల్లి స్వరూపరాణి. జన్మస్థానం: ప్రయాగ (అలహాబాద్). ఇంటివద్దే కొంతకాలం ప్రైవేటుగా చదువుకుని హారోలో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో విద్యనభ్యసించారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. 1918లో ఇండియన్ హోమూల్ లీగ్ కు కార్యదర్శి అయినారు. 1918 నుంచి అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడుగా ఉన్నారు. 1921లో మొదటిసారి కారాగృహవాసా న్ననుభవించారు. రచనాకాలం నాటికి ఎనిమిది మారులూ, స్వాతంత్య్ర పోరాట కాలంలో పలుమార్లూ జైలుశిక్ష అనుభవించారు. 1929 లో కాంగ్రెస్ కార్యదర్శి అయినారు. 1950 నుంచి 1955 వరకు కాంగ్రెస్ అధ్యక్షులుగా వున్నారు. 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి 1964వ సంవత్సరం మే 27న మరణించేవరకు భారత ప్రధానిగా వున్నారు. దేశాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు చేపట్టారు. భార్య కమలా నెహ్రూ ముందే చనిపోయింది. కొడుకులు లేరు. 'ఇందిరాగాంధీ' ఒక్కతే కుమార్తె. చెల్లెండ్రిద్దరు 'విజయలక్ష్మి పండిట్, కృష్ణ హతీసింగ్'. గొప్ప ప్రజాస్వామ్యవాది అయిన నెహ్రూ ఆంగ్లంలో అనేక గ్రంథాలను రచించారు. తాను రాసిన 'స్వీయచరిత్ర'కు కొనసాగింపుగా మరో రచనకు సంసిద్ధమైనారు. తనకు మహా ప్రీతిపాత్రమైన- తాను ప్రగాఢంగా ప్రేమించే భారతమాతను గురించి రాస్తే బాగుంటుందని 'ది డిస్కవరీ ఆఫ్ ఇండియా' గ్రంథ రచనకు పూనుకున్నారు. ఈ గ్రంథ రచనలో అబ్దుల్ కలాం ఆజాద్, గోవిందవల్లభ్ పంత్ వంటి స్వాతంత్య్ర సమరయోధులు తమ తోడ్పాటు అందించారు. ఈ పుస్తకం తెలుగులో 'భారత దర్శనం' అన్న పేరుతో వెలువడింది. వీరి రచనలలో 'సోవియట్ రష్యా', 'గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ', 'ది డిస్కవరీ ఆఫ్ ఇండియా' అన్నవి ప్రసిద్ధ రచనలు.