BHARATHA PRABHASAM by DR.DAMERA VENKATA SURYA RAO Telugu book cover

BHARATHA PRABHASAM

by DR.DAMERA VENKATA SURYA RAO

₹100
In stock · 15 available
PublisherDR.DAMERA VENKATA SURYA RAO
LanguageTelugu
ముందుమాట సూర్యారావుగారు ఉపాధ్యాయులు. అది అసాధారణమయిన అధికారం. ఆయన పెద్దమనిషి. బాధ్యతగా, దీక్షతో విషయాన్ని తెలుసుకోదలచిన వారికి పాఠం చెప్పే అనుభవమూ, ఉద్ధతీ కలవారు. ఈ రెండు లక్షణాలూ ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ కనిపిస్తాయి. ఈ వ్యాసాలన్నీ ఏవో పత్రికల్లోనో, రేడియో ప్రసంగాలుగానో, సమీక్షలుగానో, పత్రాలుగానో లోగడ వెలువడ్డాయి. సూర్యారావుగారు తను చెప్పే విషయం వేపు పాఠకుడిని ఆకర్షించే పనిచెయ్యరు. కొత్తదనాన్ని అలంకరించరు. అమ్మరు. నమ్మినవారికి బాధ్యతగా అందిస్తారు. ఇవన్నీ రచయిత పెద్దరికాన్ని, వ్యక్తి శీలాన్ని ప్రతిఫలించే విషయాలు. ప్రతీ వ్యాసంలోనూ ఆయన పొందుపరిచిన విషయాలు, వివరాలూ అపూర్వం. చెప్పేధోరణికూడా అపూర్వం. వ్రాసే ప్రతి వాక్యంలోనూ అద్భుతమైన ఆలోచనని సంధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 'మాతృసందేశం'లో - "సుఖ దుఃఖాలు మనకు గురువులు. ఇందులో దుఃఖానుభవాలు ఇచ్చే శిక్షణే మనం మన పాత్రను చక్కగా అవగతం చేసుకునేలా చేస్తాయి" విశ్వనాధ గురించి చెప్తూ వ్రాసిన మొదటి వాక్యం: "అధునికాంధ్ర సాహితీ జగత్తులో విశ్వనాధ విరాణ్మూర్తి" "హాస్యం - హాసం" వ్యాసానికి ఆఖరు మాట: "నవ్వు ప్రపంచ భాష. ఇతరులతో కలిసి నవ్వడం మానవత్వం. ఇతరులను చూసి నవ్వడం పశు