
BHARATHA RASHTRAPATHI - DROUPATHI MURMU
₹50
In stock · 16 available
PublisherDR.SHAIK HASEENA
LanguageTelugu
కష్టేఫలి ఒడిస్సా రాష్ట్రం ప్రాచీన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అక్కడి సంస్కృతి అతిపురాతనమైనది. ఈ రాష్ట్రంలో ఆదివాసుల తెగలు కూడా ఎక్కువ. 1950లో ఒడిస్సా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అలాగే వెనుకబడిన రాష్ట్రం కూడా అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల కంటే అక్షరాస్యతలో మనకంటే ముందు స్థానంలో ఉంది. లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా 2022 ప్రకారం తెలంగాణ 66.54%, ఆంధ్రప్రదేశ్ 67.02%, ఒడిస్సా 72.87% అక్షరాస్యత కలిగి ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. ఒడిస్సా కళలకు కాణాచి. ఇక్కడ కోణార్క్ పూరి, భువనేశ్వర్ లు ప్రసిద్ధ దేవాలయాలు. ఇక్కడ కోణార్క్ దేవాలయంపై ఎన్నో నృత్య భంగిమలను మనం చూడవచ్చు. అత్యధికంగా జ్ఞానపీఠ్ అవార్డులు సొంతం చేసుకున్న రాష్ట్రం కూడా ఒడిస్సా కావడం విశేషం. నందిని సత్పతి, నవీన్ పట్నాయక్ లాంటి నిస్వార్ధ నాయకులు కూడా ఒడిస్సా రాష్ట్రానికి తలమానికం. అలాంటి రాష్ట్రంలో సంతాల్ ఆదివాసి తెగకు చెందిన ద్రౌపదీ ముర్ము 15వ రాష్ట్రపతిగా భారీ విజయం సాధించడం యావత్ దేశానికి గర్వకారణం. భారతదేశ తొలి గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఒక స్ఫూర్తిదాయకమైన విజయం సాధించిన తీరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక అసాధారణ మద్దతు, అభినందనలు ఆమెకు లభించాయి. దేశంలో మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది. గతంలో శాస్త్ర సాంకేతిక రంగంలో ఖ్యాతి గడించిన అబ్దుల్ కలాం ముస్లిం. ఒక ముస్లింని రాష్ట్రపతి చేయడం గొప్ప విశేషమే. 2017లో దళితుడైన రామ్నాథ్ కోవింద్ను, ప్రస్తుతం ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిగా నియమించడం పట్ల భారతీయ జనతా పార్టీకి బేషరతుగా అభినందనలు తెలుపవలసిందే. కాగ, రానున్న ఎన్నికల్లో బిజెపికి ద్రౌపదీ ముర్ము విజయం కలిసి వస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.