BHARATHA SWATANTRA SAMARAMLO NETHAJI SUBHASH CHANDRABOSE by DR.NANDAMURI LAKSHMI PARVATHI Telugu book cover

BHARATHA SWATANTRA SAMARAMLO NETHAJI SUBHASH CHANDRABOSE

by DR.NANDAMURI LAKSHMI PARVATHI

₹200
In stock · 93 available
PublisherN.T.R EDUCATIONAL SOCIETY
LanguageTelugu
భారత స్వాతంత్ర్య సమరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ "ఏ దేశం తన పోరాట వీరులను, మాతృదేశ స్వాతంత్య్ర రక్షకుల త్యాగమయ జీవితాలను గుర్తించి గౌరవించదో ఆ దేశం తన స్వాతంత్య్ర ఫలాలను పదిల పఱచుకోలేదు." కన్నతల్లి కంటె మాతృదేశం ఎక్కువ. కన్న పేగు బంధం పుట్టిన వెంటనే విడిపోతుంది. కాని, జన్మభూమి బంధం ఆజన్మాంతం ముడిపడి ఉంటుంది. ఇది ఉన్నవాడే దేశ గౌరవాన్ని గురించి ఆలోచించ గలుగుతాడు. సర్వ సుసంపన్న మన భరతమాత ఎదుర్కొన్న బాధలు, సవాళ్లు మరే దేశం ఎదుర్కోలేదని చెప్పవచ్చు. అయితే ఆత్మగౌరవాన్ని పెంచి, దాస్య శృంఖలాలను తెంచి దాస్య విముక్తిని చేసిన వీర పుత్రులను కన్న వీరమాతగా ప్రపంచ దేశాల జేజేలు అందుకుంది. పరాయి పాలబడ్డ జన్మభూమి రక్షణ కోసం త్యాగాలు చేసి ప్రాణాలు బాసిన అమర వీరులను తలచి తలచి మాతృహృదయం గర్వంతో ఉప్పొంగి పోతుంటుంది. మత వైషమ్యాలకు, మూఢ సిద్ధాంతాలకు వర్గ విచక్షణలకు గొడ్డలి పెట్టె నూతన ఆత్మ వికాసంతో, చైతన్యంతో జాతి యావత్తూ భారతదేశ రక్షణ కోసం నడుంకట్టి పదం కలిపి ముందుకు నడిపిన ఆ క్షణాలు స్మరించటం ఆ అమరవీరులకు మనమందించే నివాళి. జాతీయత అనే గుభాళింపులో నవీన విద్యా వికాసంలో తరాల తన సంస్కృతి నాగరికతలకు మరింత వన్నె తీర్చుకున్న మన భరతజాతిని తలచి ఉప్పొంగి పోదాం.