BHARATHA TEJASWI RAJIV GANDHI by JAYA SURYA Telugu book cover

BHARATHA TEJASWI RAJIV GANDHI

by JAYA SURYA

₹30
In stock · 37 available
PublisherRAVINDRA PUBLISHING HOUSE
LanguageTelugu
అందుకే ఈ పుస్తకం... ఆ చెరగని చిరునగవు, అనురాగరంజితమైన సుందరవదనం, రాజీవ్ జీవనకథనం ఒక సుమధుర సజీవస్వప్నం. తొలిరోజులలో అంకురించిన ప్రేమ, సుధారసపూరితంగా జీవితాన్ని నడిపించింది. కుటుంబ బాంధవ్యాన్ని అభిలషించే జీవనశైలితో పైలట్ వృత్తిధర్మాన్ని బాధ్యతాయుతంగా అనుసరించారు. భారత ప్రధాని ఇందిరాగాంధీ ప్రథమవారసుడైనా అధికార వ్యామోహం రాజీవ్ను ప్రలోభపరచలేదు. తల్లి హత్యానంతర పరిస్థితులలో ఊహించని రీతిలో జీవితం మలుపు తిరిగింది. అత్యున్నత దేశ రాజకీయాధికారం వరించినా తామరాకుమీద నీటిబొట్టులా వ్యవహరించిన నిమిత్తమాత్రులు. జాతిపిత గాంధీజీ, నవభారత నిర్మాతలు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల వారసత్వ విలువల దేశభక్తి ప్రపూరిత త్యాగశీలతకు సేవాకాంక్షతో వినమ్రంగా తల ఒగ్గారు. భారత జనసామాన్య జీవన సౌభాగ్యానికి పట్టాభిషిక్తులై ప్రజాహృదయాధినేతగా శ్రమించారు. యువస్వాప్నిక ప్రేమమూర్తిగా జీవనసాఫల్యం సాధించారు. కాని విధి క్రూరంగా వంచించటంతో అయిదుపదులు నిండకుండానే జీవనసంధ్య విషాదాంతమైంది. భారతజాతి హృదయాలలో తేజస్వి రాజీవ్, నిరంతర సజీవులు. స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖ రచయిత మా నాన్నగారు స్వర్గీయ యర్రమిల్లి నరసింహారావుగారి దివ్యస్మృతికి ఈ రచన సమర్పిస్తున్నాను. జయసూర్య రవీంద్ర పబ్లిషింగ్ హౌస్ తణుకు